9, జనవరి 2017, సోమవారం

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై 
ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వఁడు  అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానె ఐనవా
డెవ్వడు  వాని ఆత్మభవుని నే శరణంబు వీడెదన్ 

శ్రీ మద్భాగవతము నందలి ఈ పద్యము గజేంద్రుడు చేసిన స్తుతిని తెలియ చేస్తుంది. ఈ జగత్తు ఎవరినుంచి ప్రభవిస్తుందో ఎవ్వరిలో నిలిచి ఉంటుందో తిరిగి ప్రళయ కాలంలో ఎవ్వరిలో లయమవుతుందో ఈ సృష్టి పూర్వము ఎవరు వున్నారో ఈ సృష్టి అంతా ఎవ్వరు నిర్వహిస్తున్నారో ఎవరు లయము చేస్తున్నారో  ఈ సృష్టి అంతా ఎవరు నిండి వున్నారో అటువంటి పరమాత్మను గజేంద్రుడు శరణు వేడినాడు.  సృష్ఠి  స్థితి లయ కారుడైన ఆ పరమాత్మను  గజేంద్రుడు శరణు వేడినాడు.  మోక్షమును పొందాడు. గజరాజు విష్ణు రూపుడై వెలుగు చుండె అని పోతన గారు అందుకే వ్రాసారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి