10, జూన్ 2012, ఆదివారం
9, జూన్ 2012, శనివారం
20, మే 2012, ఆదివారం
బ్రహ్మవిద్యను నేర్చుకొనుటకు అర్హతలు ఏమిటి?
ఆత్మను చేరాలనే కోరిక గాధముగా ఉండాలి.
సంసార తాపత్రయములను వదలి ఉండాలి
ధనేషణ, దారేషణ, పుత్రేషణ వదలి ఉండాలి
జాతి ధర్మములను పాటించాలి
ఆశ్రమ ధర్మములను పాటించాలి
నిరంతర నామ స్మరణ చేయాలి
రామాయణ, భారత, భాగవత గ్రంథములను శ్రద్ధగా చదవ వలయును
మనుగడకు ఎంత అవసరమో అంత మాత్రమె సంపాదించాలి
వాద వివాదములకు దూరముగా ఉండాలి
వీలైనంత ఏకాంతముగా ఉండాలి
బ్రహ్మ విద్య నిర్వచనము
బ్రహ్మచే బోధించబడినది ఈ బ్రహ్మ విద్య .
బ్రహ్మ గురించి బోధచేయునది బ్రహ్మ విద్య.
ఈ జగత్తు ఆది యందున్న ఆత్మ ఈ సర్వ విశ్వముగా బాహ్యముకు గోచరించుచూ అంతర్యామిగా ఆత్మగా ఉన్నది. కావున ఇహ లోకములకు పర లోకములకు సంబంధీచిన సర్వ వివరములూ బోధచేయునది ఈ బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య పరమాత్మచే నాలుగు వేదములుగా బోధించ బడినది. ఇది దేశ కాల పాత్రలకు అతీతమై సత్యమై నిత్యమై ఏకమై విరాజిల్లును.
ప్రశస్తి :
బ్రహ్మ విద్య అన్నిటికన్నా గొప్పది. ఇందు సర్వ విద్యలూ ఇమిడి ఉన్నవి. ఇది తెలుసుకున్నచో ఈ సర్వమూ తెలియును. రహస్యమైనది. మంచివారలచే సేవించబడినది. పరాత్పరుని పొందు సాధన విధానము చెప్పునది. అపర విద్య పర విద్యల సమ్మేళనము గలది.
7, జనవరి 2012, శనివారం
4, జనవరి 2012, బుధవారం
brahma vidya 1
జయ గురు దేవ దత్త
బ్రహ్మ విద్య అనగా ఆత్మను గురించి చెప్పునది. ఈ విద్యను నేర్చుకుంటే ఆత్మ అవుతారు. రామాయణ, భారత, భాగవతములు ప్రతిపాదించింది ఈ బ్రహ్మవిద్యయే. వేదమునకు విపుల వ్యాఖ్యానమైన ఈ రామాయణ, భారత, భాగవతములు. వాల్మీకి మహర్షి మఱియు వ్యాస భగవంతునిచే శ్లేషగా రచించబడినవి. అనగా పైకి కథాపరముగా ఒక విషయము అంతర్లీనముగా బ్రహ్మ విద్యను అనగా ఒక జీవుడు బ్రహ్మను చేరు విధానమును ప్రతిపాదించినవి. కావున ఈ గ్రంథములు చదువు వారు ఈ విషయమును గుర్తు ఉంచుకొనవలయును. వేదమునకు వ్యాఖ్యానము కావున వీటిని సత్గురువుల వద్దనే నేర్చు కొనవలయును.
బ్రహ్మ విద్య రెండు భాగములుగా ఉండును.
1 . అపరవిద్య (theory part) 2 . పరవిద్య (practicals part)
అపర విద్యే
శాస్త్రము (వేదము)
జాతి ధర్మములు
ఆశ్రమ ధర్మములు
దేశము ఎలా వుండాలి
రాజు ఎలా వుండాలి
ఉద్యోగులు ఎలా వుండాలి
ప్రజలు ఎలా వుండాలి
ఆత్మ గురించి
విరాట్ పురుషుని గురించి
వ్యక్తిగత విధులు, బాధ్యతలు
పురాణములు, మొదలైన అనేక విషయములు వుండును. ఇదంతా బోధించబడును.
పరవిద్యలో
అపర విద్యలో చెప్పిన శాస్త్రమును ఎలా ఆచరించి మోక్షమును పొందవలయునో చెప్పబడును.
అపర విద్య లో ఉత్తీర్ణులైన వారికే పరవిద్య బోధించబడును.వారివారి అర్హతల ననుసరించి పరమాత్మ సంకల్పముతో వారికి తగిన గురువు లభించును.
అపర విద్య లో ఉత్తీర్ణులైన వారికే పరవిద్య బోధించబడును.వారివారి అర్హతల ననుసరించి పరమాత్మ సంకల్పముతో వారికి తగిన గురువు లభించును.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)



