4, జనవరి 2012, బుధవారం

brahma vidya 1

                                      జయ గురు దేవ దత్త 
బ్రహ్మ విద్య అనగా ఆత్మను గురించి చెప్పునది.  ఈ విద్యను నేర్చుకుంటే ఆత్మ అవుతారు.  రామాయణ, భారత, భాగవతములు ప్రతిపాదించింది ఈ బ్రహ్మవిద్యయే.  వేదమునకు విపుల వ్యాఖ్యానమైన ఈ రామాయణ, భారత, భాగవతములు.  వాల్మీకి మహర్షి  మఱియు వ్యాస భగవంతునిచే   శ్లేషగా రచించబడినవి.  అనగా పైకి కథాపరముగా ఒక విషయము  అంతర్లీనముగా  బ్రహ్మ విద్యను అనగా ఒక జీవుడు బ్రహ్మను చేరు విధానమును ప్రతిపాదించినవి.  కావున ఈ గ్రంథములు  చదువు వారు  ఈ విషయమును గుర్తు ఉంచుకొనవలయును. వేదమునకు వ్యాఖ్యానము కావున వీటిని సత్గురువుల వద్దనే నేర్చు కొనవలయును.
బ్రహ్మ విద్య రెండు భాగములుగా ఉండును.
1 .  అపరవిద్య (theory part)   2 .  పరవిద్య (practicals part)
అపర విద్యే 
శాస్త్రము (వేదము) 
జాతి ధర్మములు 
ఆశ్రమ ధర్మములు 
దేశము ఎలా వుండాలి 
రాజు ఎలా వుండాలి 
ఉద్యోగులు  ఎలా వుండాలి 
ప్రజలు ఎలా వుండాలి 
ఆత్మ గురించి 
విరాట్ పురుషుని గురించి 
వ్యక్తిగత విధులు, బాధ్యతలు 
పురాణములు, మొదలైన అనేక విషయములు వుండును.  ఇదంతా బోధించబడును. 
పరవిద్యలో 
అపర విద్యలో చెప్పిన శాస్త్రమును ఎలా ఆచరించి మోక్షమును పొందవలయునో  చెప్పబడును.  
అపర విద్య లో ఉత్తీర్ణులైన వారికే పరవిద్య బోధించబడును.వారివారి అర్హతల ననుసరించి పరమాత్మ సంకల్పముతో  వారికి తగిన గురువు లభించును.