31, డిసెంబర్ 2022, శనివారం

    

                                                   భాగవత పురాణ రచనా కారణము

    ద్వాపరయుగ అంతములో ఉపరిచర వసువుకు వాసవి అను పేరుగల సత్యవతికి  విష్ణువు  అంశతో జన్మించిన వ్యాసుడు  ఒక్కనాడు బదరికాశ్రమములో సరస్వతీ నదీ తీరములో స్నానాది నిత్య కర్మలు  ఆచరించి  ఒక సూర్యోదయ వేళ ఒంటరిగా కూర్చుండి భూత భవిష్యద్వర్తమానజ్ఞుండయిన ఆ ఋషి అవ్యక్తమయిన కాలవేగానికి లోకంలో యుగధర్మాలు సాంకర్యం చెందుతాయనీ, పాంచభౌతిక దేహులు శక్తి విహీనులగుదురనీ, పురుషులు నిస్సత్తువులు, ధైర్య శూన్యులూ, మంద ప్రజ్ఙులూ, అల్పాయువులూ, దుర్బలులు అయ్యెదరనీ, తన దివ్య దృష్టితో గ్రహించి సర్వాశ్రమములకూ హితము చేయదలచి, వైదిక కర్మలూ యజ్ఙములూ అవిచ్ఛిన్నముగా సాగడం కోసం  ఒక్కటిగా ఉన్న వేదాన్ని విభజించి, పంచమవేదమమైన ఇతిహాస పురాణాలను రచించెను. వ్యాసుని శిష్యులు ఆ వేదాన్ని అధ్యయనం చేయసాగారు. వారి శిష్య ప్రశిష్యులు వేదాలనూ, పురాణేతిహాసాలనూ అధ్యయనం చేయసాగారు.  ఇట్లు మేధావిహీనులయిన పురుషులచేత వేదంబులు ధరియింపబడుచున్నవి. స్త్రీ శూద్ర త్రైవర్ణికాధములచేత వేదములు ధరియింప బడుతున్నవి.  సర్వమానవ శ్రేయస్సు కొఱకై వేదార్ధభావముల అంతా కూర్చి, పంచమవేదమని ప్రసిద్ధి చెందిన,  మహాభారతమునుమరియు దీనవత్సలుడయిన వ్యాసుడు రచించినాడు. అయినప్పటికీ వ్యాసుని మనస్సు సంతసించలేదు.  అందువల్ల వ్యాసుడు వ్యాకులపడి తన అసంతుష్టికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు.  కానీ, హరికీ, యోగివరులకు అభిలషితంబయిన భాగవత స్వరూపాన్ని చెప్పలేదు అని విచారించెను. 

    ఆసమయంలో ముల్లోకాలలో ప్రసిద్ధిచెందినవాడూ, నిఖిల శాస్త్ర పురాణ విశారదుడూ, నిరంతర నారాయణ స్మరణపరాయణుడు అయిన నారదముని అక్కడకు విచ్చేశాడు.  అలా విచ్చేసిన నారదుణ్ణి చూచి వ్యాసుడు లేచి యథావిధిగా పూజించాడు.  అంత వ్యాసుడు నారదుని తన  విచారమునకు కారణమేమని ప్రశ్నించాడు. అంత నారదుండిట్లనియె.  నాయనా నీవు అశేషాలైన ధర్మములను వెల్డడించావు. అయితే అందులో విష్ణు కధలను సమగ్రంగా వివరించలేదు.  ఎన్ని ధర్మాలను వివరించినా శ్రీహరి సంతోషించడు.  నీమనస్సుకు ఈ కొఱత రావడం నీ గ్రంధాలలో శ్రీహరి నామసంకీర్తనం ప్రధానంగా లేకపోవడమే.  హరినామ సంకీర్తనతో ప్రకాశించే గ్రంథం బంగారు కమలాలతో ప్రకాశించే హంసలతో శోభిల్లే మానససరోవరంలాగా విరాజిల్లుతుంది.  హరినామ సంకీర్తన లేని కావ్యం విచిత్రార్ధాలతో కూడినా బురదగుంటలాగా శోభస్కరంకాదు.  అప శబ్దాలతో కూడినా పవిత్రమైన  హరి చరిత్రతో కూడిన కావ్యాలు సకల పాపాలనూ పటాపంచలు చేస్తాయి. అందువల్లనే, సాధువులూ, తాపసులూ  శ్రీహరిని భావిస్తూ,  ఆయన లీలలను గానంచేస్తూ, ఆయన నామజపం చేస్తూ ఆయననే కీర్తిస్తూ ధన్యులు అవుతున్నారు. నిర్గతమూ, నిరుపాధికంబైన జ్ఙానము హరిభక్తిలేక శోభిల్లదు. చేసిన పని యొక్క ఫలమును కోఱక  ఆకర్మను ఈశ్వరునకు అర్పించకున్న అది శ్రేయస్సును ఇవ్వదు.  భక్తిహీనంబయిన జ్ఙానమూ,స్తోత్రమూ, కర్మనిపుణత్వమూ, నిరర్ధకము.  కావున నీవు నిఖిల బంధమోచనము కొఱకు వాసుదేవుని లీలావిశేశంబులు భక్తితో వర్ణించుము.  వాసుదేవుని వర్ణించకుండా ఇతర వర్ణనలు చేయువాని బుద్ధి ప్రచండవాయువేగానికి ప్రవాహంలో కొట్టుకు పోయే నావలాగా  ఒడ్డుచేరలేదు. కామ్య కర్మలందు ఆసక్తులైన మూఢమానవులకు నియతములైన ధర్మములు చెప్పి శాసించడం నీకు తగదు.  ఎందుకంటే వారు అదే పరమధర్మమని భావించి జుగుప్సితములైన కామ్యకర్మలకు అలవాటుపడి పరమార్ధాన్ని విస్మరించెదరు. అందువల్ల బుద్ధిమోహము జనించకుండా తగు ప్రతిక్రియ చేయవలసినది. 

    తన  కులానుగతమైన ధర్మాలను ఆచరిస్తూ, గోవింద పద సేవ చేసే పురుషుడు ఈ జన్మలో కాకున్న మరు జన్మలో ఐనా తరిస్తాడు అంతే కానీ విష్ణుసేవా దూరుడైనవాడు  ఎన్ని జన్మలెత్తినా తరించడు. కావున జ్ఙాని అగువాడు ప్రయత్నపూర్వక హరి సేవ చేసి తరించాలి. కాల క్రమముగా సుఖ, దుఃఖములు ప్రాప్తించినా హరి సేవ విడువరాదు.  ఈవిధంగా హరి సేవ చేసేవాడు జన్మనెత్తినా సంసార సాగరములో చిక్కుపడక, తన పూర్వజన్మ సంస్కారమువల్ల, హరి నామ స్మరణ చేసి తరిస్తాడు.  

    ఈవిశ్వమంతా విష్ణుమయం.  ఈసృష్టిలో విష్ణువుకు అన్యమయినది ఏదీ లేదు.  ఆ పరమేశ్వరుని  సంకల్పముచేతనే సృష్టి, స్థితి, లయములు ఏర్పడుతుంటాయి. నాయనా నీవు సర్వజ్ఙుడవు. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారలలోని విశేషములు స్తుతించి ధన్యుడవు కావలసినది. లోకంలో ఏపదార్ధం వల్ల ఏరోగం వచ్చిందో  ఆ పదార్ధంవల్ల ఆ రోగం తగ్గదు. మరొక పదార్ధంతోనే ఆరోగం నశిస్తుంది. అందువల్ల భవబంధ కారణమయిన కర్మల ను ఈశ్వరార్పణము చేయడంతోనే జ్ఙానం సిద్ధిస్తుంది. అందువల్లమాత్రమే ఈశ్వుడు సంతసించును. ఓంకాపూర్వకముగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ,  అనిరుద్ధ నామాలు భక్తితో స్మరించి,  మంత్రమూర్తియు, మూర్తిశూన్యుడు అయిన యజ్ఙపురుషుని పూజించే పురుషుడు సమదృష్టి కలవాడవుతాడు.  కాబట్టి ఓ వ్యాసమహర్షీ! నీవుకూడా శ్రీహరిని స్తుతించు. వినే వారి దుఃఖాలు అన్నీదూరమై వారికి అచల శాంతి లభించేట్లుగా నీవు భాగవత రచన సాగించి వాసుదేవుని యశోగాధలను కీర్తించు. ఈవిధంగా పలికి నారదుడు వీణమీటుతూ వెళ్ళిపోయాడు.  

    అంత వ్యాసమహర్షి, ఈవిశాల మహీతలంలో ఏ మహాగ్రంధాన్ని విన్నంతమాత్రమే సంసారబంధాలు  సమసిపోయి లోకశరణ్యుడైన మాధవునిపై అచంచల భక్తి ఆవిర్భవిస్తుందో అటువంటి లోకకల్యాణకరమైన భాగవతామ్నాయమును  నేర్పుతో రచించెను.

    కావున శ్రీహరిగుణ కీర్తనమందు ఆసక్తులైన పురుషులు ముల్లోకములకూ కల్యాణ ప్రదమైన భాగవత మహాపురాణ అధ్యయనము చేసి కైవల్యాన్ని పొందవలసినది 

                                                                ఓం తత్సత్

30, అక్టోబర్ 2022, ఆదివారం

ఆశ్రమ ధర్మములు

ఆశ్రమ ధర్మములు

శ్రీమద్భాగవతము,సప్తమ స్కంధము

ధర్మరాజు నారదుని ప్రశ్నించుట.

పుణ్యాత్మా! నీవు సాక్షాత్తు పద్మసంభువుడైన బ్రహ్మదేవుని మానస పుత్రుడవు. స్వచ్ఛమైన నడవడిక కలవాడవు. సర్వదా నారాయణ చరణ స్మరణ పరాయణుడవు. శాంతమూర్తివి. దయాహృదయుడవు. సర్వజ్ఞుడవు. సకల ధర్మాలూ, ఆచార వ్యవహారాలూ నీకు తెలుసు. నీవు ఎరుగని ధర్మం లేదు. అన్ని వర్ణాల వారికి పనికివచ్చే ఉత్తమమైన ధర్మం ఏది? ఏ ధర్మం ఆచరిస్తే మానవునికి నిర్మలమైన భక్తి జ్ఞానాలు ప్రాప్తం అవుతాయి? తమ వంటి వారు ఏది ఉత్తమ ధర్మం అని భావిస్తారు? అటువంటి ధర్మస్వరూపాన్ని వివరంగా చెప్పండి. నాకు వినాలని కుతూహలంగా ఉంది. అని ధర్మరాజు నారదుడిని అడిగాడు. అంతట నారదమహర్షి ఇలా చెప్పాడు “పూర్వం దక్షప్రజాపతికి నారాయణుడు తన అంశతో అవతరించాడు. లోకక్షేమం కోసం బదరికా వనంలో తపోదీక్షలో ఉండగా నారాయణుడు ఈ సనాతన ధర్మమును నాకు వివరించాడు. అలా విన్నది నీకు వివరిస్తాను. అవి:-

సకల జనుల త్రింశతి లక్షణములు (30)

సత్యము దయ

ఉపవాసాది తపము శౌచము

సైరణ సదసద్వివేకము

మనోనియమము బహిరింద్రియ జయము

హింస లేమి బ్రహ్మచర్యము

దానము యథోచిత జపము

సంతోషము మార్దవము

సమదర్శనము మహాజన సేవ

గ్రామ్యకోరికలు నిష్ఫల క్రియలు విడుచుట

మితభాషిత్వము దేహముగాని తన్ను వెదకికొనుట

అన్నోదకంబులు ప్రాణులకు పంచి యిచ్చుట ప్రాణులందు దైవత్వ బుద్ధి

యాత్మబుద్ధి చేయుట శ్రీనారాయణచరణ స్మరణకీర్తనము, శ్రవణము,సేవ

అర్చన నమస్కారము

దాస్యము ఆత్మసమర్పణము

సఖ్యము చెలిమి కలిగి ఉండుట

బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మములు

శ్రద్ధగా విను ధర్మరాజా! ముందుగా బ్రహ్మచర్య లక్షణాలు చెప్తాను. బ్రహ్మచారి మౌంజీ, కౌపీనం, యజ్ఞోపవీతం, కృష్ణాజినం, పలాశదండం, కమండలం, దర్భలు ధరించాలి; కేశసంస్కారం చేసుకొనరాదు; శీలవంతుడై ప్రవర్తించాలి; మౌనంగా మూడుపూటలూ బ్రహ్మగాయత్రిని జపించాలి; ప్రాతఃకాల, సాయంకాలలో సూర్యోపసనం, ఆగ్ని ఆరాధన, గురువందనం, దేవతార్చన చేస్తుండాలి; గురువు గారి గృహంలో దాసుని వలె భక్తిగా, వినయంగా, సౌమ్యంగా ఉంటూ వేదాలు వల్లెవేయాలి; అధ్యయానికి ఆరంభంలోనూ, చివరా ఆచార్యదేవులకు పాదాభివందనం చేయాలి; ఉదయం సాయంకాలం మంచి గృహస్థుల నుంచి భిక్షాన్నం గ్రహించి గురువులకు నివేదించి; వారి అనుజ్ఞతో మితంగా భుజించాలి; నియమిత దినాలలో ఉపవాసాలు ఉండాలి; స్త్రీలతోనూ, స్త్రీలోలురతోనూ అనవసరంగా సంభాషించ రాదు; బ్రహ్మచారి గురుపత్నులతో, పరాంగనలతో తల అంటించుకోవటం, తల దువ్వించుకోవటం, శరీరం పట్టించుకోవటం, స్నాన సపర్యలు చేయించుకోవటం, ఏకాంతంగా ఉండటం పనికిరాదు; ఎల్లప్పుడూ ఇంటిలోనే ఉండక జితేంద్రియుడై సత్యభాషణుడై మెలగాలి.స్త్రీ సాంగత్యం ఏమాత్రం తగదు; స్త్రీ దావాగ్ని వంటిది;. పురుషుడు నేతి పాత్ర వంటివాడు; సెగ తగలగానే పాత్రలోని నెయ్యిలా కరిగిపోతాడు; బ్రహ్మదేవుడు అంతటి వాడు తన కూతురిపై వ్యామోహంతో పట్టుకున్నాడు కదా! కాబట్టి, బ్రహ్మచారికి ఆడవారి సాన్నిహిత్యం పనికి రాదు.

గృహస్థ ఆశ్రమ ధర్మములు

ధర్మరాజా! ఆలకించు! ఆత్మసాక్షాత్కారం పొంది, ఇంద్రియాలకు కనిపించే బాహ్య ప్రపంచం అంతా స్వప్నమాత్రమే నని ఎరిగి, తనకూ పరబ్రహ్మకూ భేదం లేదని ఎప్పటివరకూ గ్రహించడో, అప్పటివరకూ స్త్రీ, పురుష భేదభావం వదలుట భావ్యం కాదు. కాబట్టి, బ్రహ్మచారి, యతి, గృహస్థుడు ఎవరైనా సరే మనస్సు పరిపక్వం చెందకుండా అద్వైతాను సంధానం చేసుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కనుక, కన్న కుమార్తెతో కూడా రహస్యంగా ఏకాంతంగా మెలగరాదు.

రాజా! ధర్మరాజా! శిరోజసంస్కారాలు, అభ్యంగనాదిసంస్కారాలు మానుట; చందనం, భూషణాలు మున్నగు అలంకారాలు విడిచిపెట్టుట; తన భార్యను ఋజువైన సమయంలో మాత్రమే పొందుట; ఇతర స్త్రీలను చూసి మోహం చెందకుండా ఉండుట; చక్కని మన స్థైర్యం కలిగి ఉండుట; మధు మాంస విసర్జన; మిక్కిలి ఉత్తమమైన నడవడికతో మెలగుట కలిగి తన ధర్మం నిర్వర్తించు కోవిదుడే ఉత్తమ గృహస్థుడు.

మరియు, బ్రాహ్మణుడైన గృహస్థుడు గురువులు వలన షడంగాలు అనే వేదాంగాలైన ఉపనిషత్తులు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషము లను వాటితో సహా ఋక్, యజు, స్సామ వేదాలనే వేదత్రయాన్ని పఠించాలి. తన స్థాయికి తగినట్లు వాటి అర్థ విచారణ చేయాలి. యథాశక్తి గురువులు అభీష్టాలు తీర్చాలి. ఇంటిలో ఉన్నా, వనంలో ఉన్నా నిష్ఠాగరిష్ఠుడై ఉండాలి. ఇతర జీవాలతో సహజీవనం సాగిస్తూ, ముఖ్యంగా గురువుల, అగ్నుల యందు, తన యందు, సర్వ భూతము లందు అచ్యుతుడైన పరమాత్మను దర్శించాలి. అట్టి గృహస్థుడు ఆత్మజ్ఞానంతో, ఇంద్రియ లోలత్వం లేకుండా జీవించి పరబ్రహ్మమును చేరుకుంటాడు.

వానప్రస్థ ఆశ్రమ ధర్మములు

వినవయ్యా నరనాథా! ధర్మజా! ఇక వానప్రస్థాశ్రమ ధర్మాలు చెప్తాను. వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాడు అడవులకు వెళ్ళి మునివృత్తి అవలంబించాలి. ఋషీశ్వరులు నియమించిన నియమాలు పాటించిన పుణ్యాత్ముడు మహర్లోకం చేరతాడు.

గృహస్థాశ్రమ ధర్మాలు చక్కగా నిర్వర్తించిన పిమ్మట వానప్రస్థాశ్రమం ఆరంభించాలి; అరణ్యాలలో నివసించాలి; అక్కడ దున్నకుండా దొరికే తృణ ధాన్యాలు ఉడకబెట్టినవి కానీ, పచ్చివి కానీ, ఎండలో ఎండిన ఫలాలు కానీ భుజిస్తూ జీవించాలి; అడవిలో లభించే ఆహారాలతో హవిస్సు పురోడాంశాదులు చేస్తూ, ప్రతి నిత్యం యజ్ఞం నిర్వహించాలి; నిన్నటి రోజు మిగిలిన పదార్థాలను పారేసి, ఏ రోజు కా రోజు క్రొత్తవి సంపాదించుకోవాలి; అగ్నిని కాపాడుకోవటం కోసం పర్ణశాలను కాని, కొండగుహను కానీ ఆశ్రయించ వచ్చును; గాలీ, చలీ, ఎండా, వానా మున్నగు వాటిని సహించాలి; గడ్డం గీసుకోరాదు; క్షౌరం పనికిరాదు; తల దువ్వుకోరాదు; కేవలం జటిలుడై జీవించాలి; దండం, కమండలం, జింకచర్మాలు, నారబట్టలూ ధరించాలి; పన్నెండేళ్లు కానీ, ఎనిమదేళ్ళు కానీ, నాలుగేళ్లు కానీ, రెండేళ్లు కానీ, ఒక సంవత్సరం కానీ ఏకాగ్రచిత్తంతో తపస్సు చేయాలి; బుద్ధిని చలించనీయకుండా మౌనియై జీవించాలి.
దైవవశాత్తూ కానీ, వృద్ధాప్యం వల్ల కానీ, రోగం వల్ల కానీ తన ధర్మాలూ, అనుష్ఠానాలు చేయలేని పరిస్థితులలో నిరాహార వ్రతం పూనాలి. ఆత్మ యందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి. శరీర రంధ్రాలను ఆకాశంలోనూ, నిశ్వాసం గాలిలోనూ, శరీరంలోని వేడిని తేజస్సులోనూ, రసం జలంలోనూ, శల్య మాం సాదులను మట్టిలోనూ విలీనం చేయాలి. వాక్కును వక్తృత్వంతో పాటూ అగ్ని యందూ, హస్త ద్వయాన్ని శిల్పంతో పాటూ ఇంద్రుని యందూ, పాద ద్వయాన్ని నడకతో పాటు మృత్యువు నందూ, శ్రోత్రద్వయాన్ని శబ్దంతోపాటు దిక్కుల యందూ, చర్మాన్ని స్పర్శతో పాటూ వాయువు నందూ, కళ్ళను రూపంతో పాటు సూర్యుని యందూ అనుసంధానం చేయాలి. జిహ్వను వరుణ సహితంగా నీటి యందూ, నాసికను గంధ సహితంగా భూమి యందూ, మనస్సును మనోరథంతో పాటు చంద్రుని యందూ, బుద్ధిని బోధంతో పాటు కవియైన బ్రహ్మ యందూ, మమత్వమును అహంకారంతో పాటు రుద్రుని యందూ, మనస్సును సత్యంతో పాటు క్షేత్రజ్ఞుని యందూ, వికారం పొందిన క్షేత్రజ్ఞుని గుణాలతో పాటు పరబ్రహ్మము నందూ విలీనం చేయాలి. ఈ విధంగా ఆయా విషయేంద్రియాలను ఆయా అధిదేవతలతో ఐక్యం కావించాలి.
అటు పిమ్మట పృథ్విని జలంలోనూ, జలమును తేజస్సులోనూ, తేజస్సును వాయువు లోనూ, వాయువును గగనంలోనూ, గగనమును అహంకార తత్త్వములోనూ, అహంకారాన్ని మహత్తత్త్వంలోనూ, మహత్తత్త్వమును ప్రకృతిలోనూ, ప్రకృతిని శాశ్వతుడైన పరమాత్మలోనూ లయం చేయాలి. అపుడు కేవలం చిన్మయుడుగా మిగిలిన క్షేత్రజ్ఞుడిని జ్ఞానంతో తెలుసుకుని, అద్వైతుడై కట్టెలను దహించిన అగ్నివలె పరమాత్మ అయిన నిర్వికార బ్రహ్మములో విలీనం కావాలి.

సన్యాస ఆశ్రమ ధర్మములు

పుణ్యుడా! ధర్మజ్ఞా! మానవుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి, ఆ ధర్మాలు పాటిస్తూ జీవించి, పిమ్మట ముక్తసంగుడై సన్న్యాసాశ్రమం తీసుకోవచ్చు.

సన్న్యాసాశ్రమం స్వీకరించిన సన్న్యాసి దేహమాత్రావశిష్టుడై ఉండాలి. సర్వభూతము లందూ నిరపేక్షుడుగా, క్షుకుడుగా, ఆత్మారాముడుగా, సర్వప్రాణి సమ భావం కలవాడిగా, శాంతుడుగా, సమచిత్తుడుగా ఉండి, సదా నారాయణ పరాయణుడై తేజరిల్లుతూ ఉండాలి. సన్న్యాసి శరీరం మీద గోచీ మాత్రమే ధరించాలి. దండ, కమండలాలు విసర్జించాలి. ఆత్మపరములు కానట్టి శాస్త్రాలను విసర్జించాలి. జ్యోతిషం మొదలైన లౌకిక విద్యలు పరిత్యజించాలి. కుతర్కాలకు పోకుండా, ఎట్టి పక్షపాతం పెట్టుకోకుండా, ఆత్మచింతనలోనే నిమగ్నమైన సమాధి నిష్ఠలో ఉండాలి. శిష్యులకు వంచనతో గ్రంథాలు బోధించరాదు. రకరకాల విద్యలు ప్రదర్శింప రాదు. మత్తతలో నిమగ్నుడు కారాదు. పెక్కుదినాలు ఒకేచోట నివసించ కూడదు. ఒక ఊరిలో ఒక రాత్రి మాత్రమే గడపవచ్చు. కార్యకారణాలకు అతీతమైన పరమాత్మలో విశ్వాన్ని దర్శిస్తూ, సత్ అసత్ పదార్థాలతో నిర్మతమైన ఈ విశాల విశ్వంలో పరబ్రహ్మమైన ఆత్మను సందర్శిస్తూ ఉండాలి. జాగరణ, స్వప్న, సంధి సమయాలలో ఆత్మనిరీక్షణ చేయాలి. ఆత్మకు బంధమోక్షణాలు మాయామాత్రాలు కాని, వాస్తవంగా లేవు అని భావించాలి. జన్మకు జీవితం స్థిరం కాదనీ, మృత్యువు నిశ్చయం అని తెలుసుకొని ప్రవర్తించాలి. సకల జీవకోటి పుట్టుకలకూ, నాశములకు కాలం మూలం అని గ్రహించి, అట్టి కాలం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. ఈ విధంగా జ్ఞానోత్పత్తి వరకూ ప్రవర్తించి, అటు పిమ్మట విజ్ఞాన విశేషం ప్రాప్తిస్తే “పరమహంస” అయి దండాది చిహ్నాలు ధరించికానీ, ధరించకుండా కానీ అంతరంగంలో ఆత్మను అనుసంధానం చేయగలిగి, విజ్ఞానియై ప్రకాశించాలి. బాహ్యానుసంధానాలు వలన ఇతరులకు పిచ్చివాని లాగ, అమాయక బాలుని లాగ, మూగవాడి లాగా కనిపించాలి.

సనాతన (వేద) ధర్మము ఈ విధంగా చెప్పుచుండగా, నేడు పైన వివరించిన అన్ని ఆశ్రమాలూ, చెడిపోయి, వ్యవస్థలు అన్నీ అస్తవ్యస్తములయ్యాయి. మోక్షమే పరమ ధర్మముగా ఉండవలసిన సన్యాస ఆశ్మరము ఏవిధంగా నేడు భ్రష్టు పట్టిందో, సన్యాసులు పీఠాధిపతులు ఎలా వేద విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారో చూచుచున్నాము. కాబట్టి వీరిని జాగ్రత్తగా కనిపెట్టి, జనులు తగు జాగరూకతతో మెలగవలెను.  

సనాతన (వేద) ధర్మము చెప్పిన ప్రకారము జనులు ప్రవర్తించినచో శాంతి, సౌభాగ్యములు లభించి, సుఖించెదరు.



5, అక్టోబర్ 2022, బుధవారం

 

శ్రీగురు గీత


శ్రీ గురుభ్యో నమ:


జయ గురు దేవ దత్త


1. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురు స్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

2. దత్తాత్రేయ సమారంభం నృసింహాదిక మధ్యమాం

సచ్చిదానంద పర్యంతం వందే గురు పరం పరామ్

3. హంసాభ్యాం పరివృత్త హార్ద కమలే శుద్ధే జగత్కారణం

విశ్వాకార మనేక దేహ నిలయం స్వచ్ఛంద మానందకం

సర్వాకార మఖండ చిద్ఘనం రసం పూర్ణం హ్యనంతం శుభం

ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం ధ్యాయే ద్విభుం శాశ్వతం

4. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్షశివ రూపిణం

శిరసా యోగ పీఠస్థం ముక్తి కామ్యార్ధ సిద్ధయే

5. ప్రాత శ్శిరసి శుక్లాబ్జే ద్వినేత్రం ద్విభుజం గురుం

వరాభయకరం శాంతం స్మరేత్తన్నామ పూర్వకం

ప్రసన్న వదనాంభోజం సర్వదేవ స్వరూపిణమ్

తత్పాదోదక జాం ధారాం నిపతంతీం స్వమూర్ధనిద

తయా సంక్షాళయే ద్బాహ్య మాతరం దైహికం మలమ్

తత్ క్షథా ద్విరదో మర్త్యో జాయతే స్పటికోపమః

6.తీర్ధాని దక్షిణపాదే వేదా స్తన్ముఖ మాశ్రితాః

పీయూష భాజనం హంహూ సద్గురోః కరనేత్రయోః

7. ఆపాద మౌళి పర్యన్తం గురుణామాకృతిం స్మరేత్

తేన విఘ్నా: ప్రణస్యంతి సిద్ధ్యన్తి చ మనో రధాః


శ్రీ వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణములోని

శ్రీగురు గీత

ఋషయ ఊచుః


గుహ్యా ద్గుహ్యతరాసారా గురుగీతా విశేషతః

తవప్రసాదా చ్చ్రోతవ్యాం తాం సర్వాం బౄహిసూత నః 1

కైలాస శిఖరే రమ్యే భక్తానాగ్రహ తత్పరమ్

ప్రణమ్య పార్వతీ భక్త్యా శంకరం పరిపృచ్చతి 2

నమస్తే దేవదేవేశ పరాత్పర జగద్గురో

సదాశివ మహాదేవ గురు దీక్షాం ప్రయచ్చమే 3

భగవన్ సర్వ ధర్మజ్ఞ వ్రతానా ముత్త మోత్తమమ్

బౄహిమే కృపయా శంభో గురు మహాత్య్మ మద్భుతమ్ 4

కేన మార్గేణ భో స్వామిన్ దేహీ బ్రహ్మ మయో భవేత్

కురు మే అనుగ్రహం దేవ నమామి చరణౌ తవ 5

మమ రుపా అసి దేవా త్వం ద్భక్త్యా తద్వదామ్య హమ్

లోకోపకారకాః ప్రశ్నః కృతః కేనా అపినో పురా 6

యో గురు స్స శివః ప్రోక్తో య శ్శివ స్స గురు స్స్మృతః

వికల్పంయస్తు కుర్వీత స భవేత్ పాతకీ గురౌ 7

దుర్లభం త్రిషు లోకేషు తచ్చృణు ప్రవదా మ్యహమ్

గురుం బ్రహ్మ వినా నాన్యత్ సత్యం వరాననే 8

వేద శాస్త్ర పురాణాని సేతి హాసాది కాని చ

మంత్ర తంత్రాది విద్యా శ్చ స్మృతి రుచ్చాట నాదికమ్9

శైవ శాక్తాఽ గమాఽదీని హ్యన్యే చ బహవో మతాః

భ్రామకా స్సర్వ ఏవై తే జీవానా మల్ఫ చీతసామ్ 10

యజ్ఞో వ్రతం తపో దానం జప స్తీర్ధం తథైవ చ

సర్వేషా మేవ జంతూనాం సర్వేమార్గాః ప్రదారకాః11

జప స్తపో వ్రతం తీర్ధం యజ్ఞో దానం తథైవ చ

గురుతత్వ మవిజ్ఞాయ సర్వం భవేత్ ప్రియే 12

గురో ర్వి ద్యాత్మనో నాన్యత్ సత్యం సత్యం న సంశయః

తల్లాభర్థం ప్రయత్నస్తు కర్తవ్యో హి మనీషిభిః 13

రూఢా ఽవిద్యా జగన్మాయా దేహే ఽస్తి ధ్వాంత రూపిణి

తద్వారకః ప్రకాశశ్చ గురు శబ్దేన కథ్యతే 14

య దంఘ్రి కమల ద్వంద్వం ద్వంద తాప నివారకమ్

తారకం భవ సింధో శ్చతం గురుం ప్రణమా మ్యహమ్15

దేహీ బ్రహ్మ హవే ద్య స్మాత్ త దిదానీం ప్రకాశయే

సర్వ పాప విశుద్ధాత్మా శ్రీ గురోః పాద సేవనాత్ 16

గురోః పాదోదకం పీత్వా ధృత్వా శిరసి పావనమ్

సర్వ తీర్థా ఽ వగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః 17

శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః

గురోః పాదోదకం దేవి సంసారార్ణవ తారకమ్ 18

అవిద్యా మూల నాశాయ జన్మ కర్మ వివృత్తయే

జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురు పాదోదకం పిబేత్ 19

గురు పాదోదకం పానం గురో రుచ్చిష్ట భోజనం

గురుమూర్తే స్సదా ధ్యానం గురు స్తోత్రం పరో జపః 20

స్వదేశిక స్వైవ చ నామ కీర్తనం భవే దనంతస్య శివస్య కీర్తనం

స్వదేశిక స్వైవ చ రూప చింతనం భవే దనంతస్య శివస్య చింతనమ్ 21

యత్పాద పాంసవః సంతః కే ఽపి సంసార వారిధేః

హేతు బంధాయ కల్పంతే దేశికం త ముపాస్మ హే 22

కాశీక్షేత్ర నివాసశ్చ జాహ్నవీ చరణోదకమ్

గురుర్విశ్వేశ్వర స్సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చితమ్ 23

గురుపాదాంకితం యత్ర గయా పాఽధోక్షజోద్భవా

తీర్ధరాజః ప్రయాగోఽసౌ గురుమూర్త్యై నమో నమః 24

గురుమూర్తిం స్మరేన్నిత్యం గురో ర్నామ సదా జపేత్

గురో రాజ్ఞాం ప్రకుర్వీత గురో రన్యం న భావయేత్ 25

గురు వక్త్ర స్థితా విద్యా ప్రాప్యతే తత్ప్రసాదతః

తస్మాత్తం దేశికం ధ్యాయేత్ యథా యోషిత్ ప్రియం స్వకమ్ 26

స్వాశ్రమం చ స్వజాతిం చ స్వకీర్తిం పుష్టివర్ధనమ్

ఏతత్సర్వం పిత్యజ్య గురు మేవ సమాశ్రయేత్ 27

అనన్యా శ్చింతయంతో యే ధ‌ృవం తేషాం పరం పదమే

తస్మాత్ సర్వ ప్రయత్నేన గురో రారాధనం కురు 28

గురో ర్ముఖాచ్చ సంప్రాప్య దేవి బ్రహ్మాత్మ సంవిదమ్

త్రైలోక్య స్పుట వక్తారో దేవర్షి పితృమానవాః 29

గుకార శ్చాంధకారో హి రుకార స్తేజ ఉచ్యతే

అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురు రేవ న నంశయః 30

గుకార శ్చాంధకారస్తు రుకార స్త న్నిరోధకః

అంధకార వినాశిత్వాత్ గురు రిత్యభిధీయతే 31

గుకార స్స్యా ద్గుణాతీతో రూపాతీతో రుకారకః

గుణ రూప విహీనత్వత్ గురు రిత్యభిధీయతే 32

గుకారః ప్రథమో వర్ణో మాయాది గుణభాసకః

రుకారో ఽస్తి పరం బ్రహ్మ మాయా భ్రాంతి విమోచకః 33

ఏవం గురుపదం శ్రేష్టం దేవానా మపి దుర్లభమ్

హాహా హూహూ గణైశ్చైవ గంధర్వై రపి పూజతమ్ 34

ధృవం తేషాం చ సర్వేషాం నా ఽస్తి తత్వం గురోః పరమ్

గురో రారాధనం కార్యం స్వజీవత్వ నివేదయేత్ 35

ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం

సాధకేన ప్రదాతవ్యం గురో స్సంతోష కారణమ్ 36

కర్మణా మనసా వాచా నిత్య మారాధయే ద్గురుమ్

దీర్ఘ దండం నమస్కుర్యా న్నిర్లజ్జో గురు సన్నిధో 37

శరీర మర్ధం ప్రాణాంశ్చ సద్గురుభ్యో

ఆత్మాన మపి దాస్యాయ వైదేహో జనకా యథా 38

గురు రేవ జగ త్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకమ్

గురోః పరతరం నాస్తి తస్మా త్సం పూజయే ద్గురుమ్ 39

యస్యా ఽనుగ్రహ మాత్రేణ హ‌ృద్యుత్పద్యేత తతో క్షణాత్

జ్ఞానం చ పరమానందః సద్గురు శ్శివ ఏవ సః 40

భస్మ కీట విడంతం హి దేహం స్థూలం వరాననే

త్వ జ్మూత్ర రుధిరా ఽంత్రా ఽస్తి మల మాంసాది భాజనమ్ 41

సంసార వృక్ష మారుఢాః పతంతో నరకార్ణవే

సర్వే యేనోద్ధృతా లోకాస్తస్మై శ్రీ గురువే నమః 42

గురు ర్బ్రహ్మా గురు ర్విష్ణుః గురుర్తేవో మహేశ్వరః

గురు రేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురువే నమః 43

అఖండ మండలాఽకారం వ్యాప్తం యేన చరాచరమ్

తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః 44

దేహే జీవత్వ మాపన్నం చైతన్యం విష్కళం పరమ్

త్వ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః 45

అఖండం పరమార్ధం సదైక్యం చత్వం తదో శ్శుభమ్

అసినా దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః 46

సర్వ శృతి శిరోరత్న నీరాజిత సదాంబుజమ్

వేదాన్తాంబుజ సూర్యాభం శ్రీగురుం శరణం వ్రజేత్ 47

చైతన్యం శాశ్వతం శాంతం మాయా ఽతీతం నిరంజనమ్

నాద బిందు కళాఽతీతం తస్మై శ్రీ గురవే నమః 48

స్థావరం జంగమం చేతి యత్కించి జ్జగతీ తలే

వ్యాప్తం యస్య చితా సర్వం తస్మై శ్రీ గురువే నమః 49

త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధు స్త్వం చ దైవతమ్

సంసార ప్రీతి భంగాయ తుభ్యం తస్మై శ్రీ గురవేనమః 50

యత్సత్తయా జగత్సత్త్వం యత్ప్రకాశేన భాయుతమ్

నందనం చ యదానందాత్ తస్మై శ్రీగురవే నమః 51

యేన చేతయతా ఽపూర్వ చిత్తం చేతయతే నరః

జాగ్రత్స్వప్న సుషుప్త్యా దౌ తస్మై శ్రీగురవే నమః 52

యస్య జ్ఞానా దిదం విశ్వ మదృశ్యం భేద భేదతః

సత్స్వరూపాఽవ శేషం చతస్మై శ్రీగురవేనమః 53

యఏవ కార్య రూపేణ కారణేనా ఽపి భాతి చ

కార్య కారణ నిర్ముక్త స్తస్మై శ్రీగురవే నమః 54

జ్ఞాన శక్తి స్వరూపాయ కామితార్ధ ప్రదాయినే

భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః 55

అనేక జన్మ సంప్రాప్త కర్మ కోటి విదాహినే

జ్ఞానా ఽనల ప్రభావేణ తస్మై శ్రీగురవేనమః 56

నగురోరధికం తత్వం నగురోరధికం తపః

నగురోరధికం జ్ఞానం తస్మైశ్రీగురవేనమః 57

మన్నాధ శ్శ్ర జగన్నాధో మద్గురు స్త్రి జగద్గురుః

మమాఽత్మా సర్వ భూతాత్మా తస్మై శ్రీ గురవే నమః 58

గురు రాది రనాది శ్చ గురుః పరమదైవతమ్

గురో సమానః కోఽవాస్తి తస్మై శ్రీగురవే నమః 59

ఏక ఏవ పరో బంధ ర్విషమే సముపస్థితే

నిస్పృహః కరుణా సింధు స్తస్మై శ్రీగురవే నమః 60

గురు మధ్యే స్థితం విశ్వం విశ్యమధ్యే స్థితోగురుః

విశ్వరూపో విరూపోఽసౌ తస్మై గురవే నమః 61

భవారణ్య ప్రవిష్టస్య దిజ్ఞ్మోహ భ్రాన్తచేతనః

యేన సందర్శితః పంథాస్తస్మై శ్రీగురవేమః 62

తాపత్రయాఽగ్ని తప్తానాం శ్రాన్తానాం ప్రాణినా ముమే

గురు రేవ పరాగంగా తస్మై శ్రీగురవేనమః 63

హేతవే సర్వ జగతాం సంసారార్ణవ సేతవే

ప్రభవే పర్వ విద్యానాం శంభవే గురవే నమః 64

ధ్యానమూలం గురో ర్మూర్తిః పూజా మూలం గురోః పదమ్

మంత్ర మూలం గురో ర్వాక్యం మోక్ష మూలం గురోః కృపా 65

హరణం భవరోగస్య తరణం క్లేశ వారిధేః

భరణం సర్వ లోకస్య శరణం చరణం గురోః 66

శివే రుష్టే గురుస్త్రాతా గురౌ రుష్టేన కశ్చన

తస్మాత్ పరగురుం లబ్ధ్వా తమేవ శరణం వ్రజేత్ 67

అత్రినేత్ర శ్శివ సాక్షాత్ ద్వభుజ శ్చాఽపరో హరిః

యోఽచతు ర్వదనో బ్రహ్మా శ్రీ గురుః కథితః ప్రియే 68

నిత్నయ నిర్వికారాయ నిరవద్యాయ యోగినే

నిష్కళాయ నిరీహాయ శివాయ గురవే నమః 69

శిష్య హృత్పద్మ సూర్యాయ సత్యాయ జ్ఞానరూపిణే

వేదాంత వాక్య వేద్యాయ శివాయ గురవే నమః 70

ఉపాయోపేయ రూపాయ సదుపాయ ప్రదర్శినే

అనిర్వాచ్యాయ వాచ్యాయ శివాయ గురవే నమః 71

కార్రయ కారణ రూపాయ రూపాయ తే సదాః

అప్రమేయ స్వరూపాయ శివాయ గురవే నమః 72

దృ గ్దృశ్య ద్రష్టృరూపాయ నిష్పన్న నిజరూపిణే

అపారాయాఽ ద్వితీయాయ శివాయ గురవే నమః 73

గుణాధారాయ గుణినే గుణవర్జిత రూపిణే

జన్మినే జన్మ హీనాయ శివాయ గురవే నమః 74

అనాద్యా యాఽఖిలాఽద్యాయ మాయినే గతమాయినే

అరూపాయ స్వరూపాయ శివాయ గురవే నమః 75

సర్వ మంత్రస్వరూపాయ సర్వతంత్ర స్వరూపిణే

సర్వగాయ సమస్తాయ శివాయ గురవే నమః 76

మనుష్య చర్మణా బర్ఱ స్సాక్షా త్పర శివ న్స్వయమ్

గురు రిత్యభిధాం గృహ్ణన్ గూఢః పర్యటతి క్షితౌ 77

శివ వద్దృశ్మతే సాక్షాత్ శ్రీగురుః పుణ్య కర్మణామ్

నరవద్దృశ్యతే సైవ శ్రీ గురుః పాప కర్మణామ్ 78

శ్రీనాధ చరణద్దందద్దం యస్యాం దిశి వికాజతే

తస్యై దిశే నమస్కుర్యాత్ భక్త్యా ప్రతి దినం ప్రియే 79

తస్మై దిశ సతత మంజలి రేష నిత్యం

ప్రక్షిప్యతే ముఖరితా ఽలి యుత ప్రసూవైః 80

జాగన్త మత్ర భవాన్ గురు చక్రవర్తీ

విశ్వ స్థితి ప్రలయ నాటక విత్య సాక్షి 81

ఉరసా శిరసా చైవ మనసా వచసా దృశా

పద్ఛ్యం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టంగ ఉచ్యతే 82

గురోః కృపా ప్రసాదేవ బ్రహ్మ విష్ణు మహేశ్వరాః

సమర్ధా స్తత్ప్రపాదో హి కేవలం గురు సేవయా 83

దేవ కిన్నర గంధర్వాః పితరో యక్ష చారణాః

మునయో నైవ జానంతి గురు శుశ్రూషణే విధిమ్ 84

మదఽహంకార గర్వేణ తపో విద్యా బలాఽన్వితాః

సంసార కుహరాఽవర్తే సతితా ఘట యంత్రవత్ 85

ధ్యానం శృణు మహాదేవి శ్రీ గురోః కథయామి తే

సర్వ సౌఖ్యకరం తద్వత్ భుక్తి ముక్తి ప్రదాయకమ్ 86

శ్రీ మత్పర బ్మహ్మ గురుం స్మరామి

శ్రీ మత్ప బ్రహ్మ గురుం భజామి

శ్రీ మత్పర బ్రహ్మ గురుం వదామి

శ్రీమత్పర బ్రహ్మ గురుం నమామి 87

బ్రహ్మా నందం పరమ సుఖదం కకేవలం జ్ఞానమూర్తిం

ద్వంద్వాఽతీతం గగన సదృశం తత్వమస్యాఽదిలక్ష్యమ్ 88

ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షీ భూతం

భవాఽతీతం త్రిగుణ రహితం సద్గురుం తం నమామి 89

ఆనంద మానదకరం ప్రసన్నం జ్ఞాన స్వరూపం నిజ బోధ యుక్తం

యోగీంద్ర మీఢ్యం భవ రోగ వైద్యం శ్రీమద్గురుం నిత్య మహం నమామి 90

నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనమ్

నిత్యబోధ చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహమ్ 91

హృదంబుజే కర్ణిక మధ్య సంస్థే సింహాసనే సంస్థిత దివ్య మూర్తిమ్

ధ్యాయేద్గురం చంద్రకలా ప్రకాశం సచ్చి త్సుఖాఽభీష్ట వరం దదానమ్ 92

శ్వేతాం బదం శ్వేత విలేప పుష్పం ముక్తా విభూషం ముదితం త్రినేత్రం

వామాంక పీఠస్థితి దివ్య శక్తిం మంద స్మితం సాంద్ర కృపానిధానమ్ 93

యస్మిన్ సృష్టి స్థితి ధ్వంస విగ్రహాఽనుగ్రహాఽత్మకమ్

కృతం పంచవిధం శశ్వత్ భపత్ తం గురుం భజేతే 94

నగురో రధికం నగురో రధికం నగురో రధికం నగురో రధికం

శివ శాసనత శ్శివ శాసనత శ్శివ శాసనత శ్శివ శాసనతః 95

జ్ఞేయం సర్వం విలాప్యేత విశాద్ధ జ్ఞాన యోగతః

జ్ఞాతృత్వ మపి చిన్మాత్రే నాన్యః పంథా ద్వతీయకః 96

యావత్తిష్టతి దేహోఽసౌ తావ ద్దేవి గురుం స్మరేత్

గురులోపోన కర్తవ్యో నిష్ టితోఽప్యద్వయే పరే 97

హుంకారేణ న వక్తవ్యం ప్రాజ్ఞే శ్శిష్యైః కదాచన

గురో రగ్రే న వ్యక్త వ్య మసత్యం చ కదాచన 98

గురుం త్వం కృత్య హుంకృత్య గురుం నిర్జిత్వ వాదతః

అరణ్యే నిర్జలే ఘోరే సంభవేతే బ్రహ్మ రాక్షసః 99

ఉప భుంజీత నో వస్తు గురోః కించిదపి స్వయం

దత్తం గ్రాహ్యం ప్రసాదేతి ప్రాయోహ్యేతన్న లభ్యతే 100

పాదుకాఽసన శయ్యాఽది గురుణా య దధిష్ఠితమ్

నమస్కార్వీత తత్పర్వం పాదాభ్యాం న స్పృశేత్ క్వచిత్ 101

గచ్చతః పృష్ఠతో గచ్చేత్ గురుపాదౌ న లంఘయేత్

నోల్పణం ధారయే ద్వేషం నా ఽలంకారాం స్తథోల్బణాన్ 102

గురు నిందా పరం దృష్ట్వా ధావయే దథ వారయేత్

స్థానం వా తత్పరిత్యాజ్యం జిహ్వాచ్చేదో క్షమా యది 103

అప్రియస్య చ హాస్యస్య నా ఽవ కాశో గురోః పురః

న నియోగపరం బ్రూయాత్ గురో రాజ్ఞాం విభావయేత్ 104

మునిభ్యః పన్నగేభ్య శ్చ సురేభ్య శ్శాపత్ఽ పివా

కాల మృత్యు భయాద్వాఽపి గురూ రక్షతి పార్వతి 105

నిత్యం బ్రహ్మ నిరాకారం యేన ప్రాప్తం స వై గురుః

స శిష్యం ప్రాపయే త్ప్రాప్యం దీపో దీపాన్తరం యథా 106

గురోః కృపా ప్రసాదేన బ్రహ్మాఽహ మితి భావయేత్

అనేన ముక్త మార్గేణ హ్యాత్మజ్ఞానం ప్రకాశయేత్ 107

సంపశ్యే చ్చ్రీ గురుం శాంతం పరమాత్మ స్వరూపిణం

స్థావరే జంగమే చైవ సర్వత్ర జగతీతలే 108

శ్రీగురుం సచ్చిదానందం భావాఽతీతం విభావ్య చ

తన్నిదర్శిత మార్గేణ ధ్యాన మగ్నో భవే త్సేధీః 109

పరాత్పర తరం ధ్యాయేత్ శుద్ధ స్పటిక పన్నిభమ్

హృదయాఽకాశ మధ్యస్థం స్వాఽంగుష్ఠ పరిమాణాకమ్ 110

అంగుష్ఠ మాత్రం పురుషం ధ్యాయత శ్చిన్మయం హృది

తత్ర స్ఫురతి యో భావ శ్శౄణు త త్కథయామి త్ 111

విరజం పరమాఽకాశం ధృవ మానంద మవ్యయమ్

ఆగోచరం తథాగమ్యం నామ రూప వివర్జితమ్ 112

తదహం బ్రహ్మ కైవల్య మితి బోధః ప్రజాయతే

యథా నిజ స్వభావేన కేయూర కటకాదయః 113

సావర్ణత్వేన తిష్ఠంతి తథాఽహం బ్రహ్మ శాశ్వతమ్

ఏవంం ధ్యాయన్ పరం బ్రహ్మ స్థాతవ్యం యత్ర కుత్రచిత్ 114

కీటో భృంగం ఇవ ధ్యానాత్ బ్రహ్మైవ భవతి స్వయమ్

యదృచ్చయా చోపపన్న హ్యల్పం బహుళ మేవ వా 115

నీరాగేణైవ భుంజీత అభ్యాస సమయే ముదా

ఏక మేవాఽద్వతీయోఽహం గురువాక్యాత్ సునిశ్చితమ్ 116

ఏవ మభ్యసతో నిత్యం స సేవ్యం యై వనాంతరమ్

అభ్యాసా న్నిమిషేణైవ సమాధి మధి గచ్చతి 117

జన్నకోటి కృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి

నతత్ సఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినామ్ 118

యత్సుఖం వీతరాగస్య సదా సంతుష్ఘ చేతసః

రసం బ్రహ్మ పిబే దృశ్చ తృప్తోయః పరమాత్మని 119

ఇంద్రం చ మనుతే రంకకం నృపాణాం తత్ర కా కథా

దేశః పూతో జనాః పూతా స్తాదృశో యత్ర తిష్ఠతి 120

తత్కటాక్షోఽథ సంసర్గః పరస్మై హ్రేయసే ఽప్యలమ్

దేహీ బ్రహ్మ భవే దేవం ప్రసాదాత్ ధ్యనతో గురోః 121

నరాణాం చ ఫల ప్రాప్తౌ భక్తి రేవ హి కారణమ్

ముక్తస్య లక్షణం దేవి తవాఽగ్రే కథితం మయా 122

గురుభక్తి స్తథా ధ్యానం సకలం తవ కీర్తితమ్

గురుగీతాఽతి గుహ్యేయం మయాఽస్తి కథితాశుభా 123

శ్రీగురుం చిన్నయం ధ్యయన్ యమహం కలయే సదా

గురుగీతా మిమాం దేవి శుద్ధతత్వం మయోదితం 124

గురుం మాం ధ్యాయతీ ప్రేమ్ణా హృది నిత్యం విభావయ

ఇయం చే ద్భక్తిభావేన పఠ్యతే శ్రూయతు ఽథవా 125

లిఖ్యతే దీయతే పుంభిర్భ వేద్భవ వినాశినీ

అనంతఫల మాప్నోతి గురు గీతా జపేన తు 126

అన్యాశ్చ వివిథా మంత్రాః కలాం నాఽర్హంతి షోడశీమ్

సర్వ పాప ప్రశమనీ సర్వసంకట నాశనీ 127

సర్వ సిద్ధికరీ చేయం సర్వలోక వశంకరీ

దుస్సప్న నాశినీ చేయం సుస్వప్న ఫలదాయినీ 128

రిపూణాం స్తంభినీ గీతా వాచస్పత్య ప్రదాయినీ

కామినాం కామధేనుశ్చ సర్వమంగళ కారణీ 129

చింతామణి శ్చింతితస్నయ శ్లోకే శ్లోకే చ సిద్ధిదా

మోక్షకామో జపేన్నత్యం మోక్షశ్రియ మవాప్నుయాత్ 130

పుత్ర కామో లభేత్ పుత్రాన్ శ్రీకామ శ్చామితాం శ్రియమ్

త్రివార పఠనా త్సద్యః కారాగారా ద్వముచ్యతే 131

నిత్య పాఠాత్ భవేచ్చ స్త్రీ పుత్రిణీ సుభగా చిరమ్

ఆకామత స్త్రీ విధవా జపే న్మోక్ష మవాప్నుయాత్ 132

అవైధవ్యం సకామా చే ల్లభే చాఽన్యజన్మని

జపే చ్చాక్తశ్చ సౌరశ్చ గణాపత్యశ్చ వైష్ణవః 133

శైవశ్చ సిద్ధిదా మేతాం సర్వ దేవ స్వరూపిణీమ్

తీర్ధే బిల్వ తరో ర్మూలే వట మూలే సరిత్తటే 134

దేవాలయే చ గోష్ఠే చ మఠే బృందావనే తథా

పవిత్ర నిర్మలే స్థానే జప శ్రీఘ్రఫల ప్రద 135

శాంత్యర్ధం ధారయే చ్చుక్లం వస్త్రం వశ్యే థ దక్తిమమ

అభిచారే నీల వర్ణం పీతవర్ణం ధనాగమే 136

గురుభక్తో భవే చ్చీఘ్రం గురు గీతా జపేన తు

ధన్యా మాతా పితా ధన్యో ధన్యా వంశ్యా జనా అపి 137

ధన్యా చ వసుధా యత్ర గురు భక్తః ప్రజాయతే

ఇదం రహస్యం నో వాచ్యం యస్మై కస్మై చన ప్రియే 138

అభక్తే వంచకే ధూర్తే పాషండే నాస్తికే తధా

మనసాఽపిన వక్తవ్యా గురుగీతా కదాచన 139

అత్యస్త పక్వ చిత్తస్య శ్రద్ధా భక్తి యుతస్య చ

ప్రవక్తవ్యా ప్రయత్నేన మమాఽత్మ ప్రీయతే తదా 140

గురువో బహవ స్సంతి శిష్య సంతాప హారకాః

దుర్లభ స్సగురు ర్లోకే శిష్య సంతాప హారకాః 141

జ్ఞానహీనో గురుం మన్యో విధ్యావాదీ విడంబకః

స్వవిశ్రాంతిం న జానాతి పరశాన్తిం కరోతి కిమ్ 142

స్వయం తరితు మక్షమః పరా న్నిస్తారయే త్కథమ్

దూరేతం వర్ణయే త్ప్రాజ్ఞో ధీర మేవ సమాశ్రయేత్ 143

సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే

నమ శ్రీ గురు నాథాయ ప్రకాశనంద మూర్తయే 144

సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లేశ హారిణే

సమో వేదాన్త వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే 145

యస్య ప్రసాదా దహమేవ విష్ణు ర్మ య్యేవ సర్వం పరికల్పితం చ

ఇత్థం విజానామి సదాత్మ తత్వం తస్యాంఘ్రి పద్మం ప్రణతోఽస్మి విత్యమ్ 146

ఇతి శ్రీ స్కాంద పురాణే ఉత్తర ఖండే ఉమామహేశ్వర సంవాదే

                            శ్రీగురు గీతా సమాప్తా

                                        శివమ్

                                      మంగళం

                                    జయగురుదత్త

                                జయ గురు దేవ దత్త

                దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబదా

                    అవధూత చింతన శ్రీ గురు దేవ దత్త