7, జూన్ 2021, సోమవారం

Kaliyuga and its symptoms




                                            కలియుగ లక్షణములు

సీ.  ఒక కాలమునఁ పండు నోషధిచయము వే
                    ఱొక కాలమునఁ పండ కుండు నండ్రు
        క్రోధంబు లోభంబు క్రూరత బొంకును
                    దీపింప నరులు వర్తింతు రండ్రు
        వ్యవహారములు మహా వ్యాజ యుక్తము లండ్రు
                    సఖ్యంబు వంచనా సహా మండ్రు
        మగలతొ నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు
        సుతులు దండ్రుల దెగఁ జూతు రండ్రు

తే.       గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు,
           శాస్త్ర మార్గములెవ్వియుఁ జరుగ వండ్రు
            న్యాయ పద్ధతి బుధులైన నడవరండ్రు
            కాలగతి వింతయై వచ్చెఁ గంటే నేఁడు


                                                            (శ్రీమద్భాగవతము‌--ప్రథమ స్కంధము--322)

కలియుగములో ఔషధులు(పంటలు) ఒకసారి పండుతాయనీ వేరొకసారి అవే పంటలు పండవనీ, ప్రజలు కోపము, లోభము, క్రూరులుగ ఉందురనీ, అబద్ధాలు ఆడుతూ ఉంటారనీ,  ఒకరిపై ఒకరు కుట్రలూ కుతంత్రాలూ పన్నుతూ ఉంటారనీ, స్నేహంలో కూడా వంచన ఉంటుందనీ, భర్తలతో భార్యలు తగువు పడుతూ ఉంటారనీ, కొడుకులు తండ్రులను చంపుతారనీ, గురువులతో శిష్యులు తగువు పడుతూంటారనీ, జ్ఞానులు కూడా న్యాయంగా ఉండరనీ,  ఈ విధంగా కాలం లో అనేక మార్పులు వస్తాయనీ వ్యాస భగవానుడు శ్రీ మద్భాగవతము లో తెలియ చేశారు. 
కావున జాగరూకతతో మెలగవలసినది.
        

                            

వరద: కార్తవీర్యాది రాజ రాజ్యప్రదోనఘ:
విశ్వశ్లాఘ్యోఅమితాచారో దత్తాత్రేయో మునీశ్వర:
పరాశక్తి పరాశ్లిష్టో యోగానంద: సదోన్మద: సమస్త వైరితేజో హృత్ 
పరమామృత సాగర: అనసూయాగర్భరత్నం 
భోగమోక్షసుఖ ప్రద:
శ్రీపాద వల్లభ పాతు నృసింహ సరస్వతీ।।


వాసుదేవాయ దత్తాయ దండకుండీధరాయచ।
నతొోస్మి విశ్వరూపాయ భవభీతి హరాయచ।।