ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వఁడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానె ఐనవా
డెవ్వడు వాని ఆత్మభవుని నే శరణంబు వీడెదన్
శ్రీ మద్భాగవతము నందలి ఈ పద్యము గజేంద్రుడు చేసిన స్తుతిని తెలియ చేస్తుంది. ఈ జగత్తు ఎవరినుంచి ప్రభవిస్తుందో ఎవ్వరిలో నిలిచి ఉంటుందో తిరిగి ప్రళయ కాలంలో ఎవ్వరిలో లయమవుతుందో ఈ సృష్టి పూర్వము ఎవరు వున్నారో ఈ సృష్టి అంతా ఎవ్వరు నిర్వహిస్తున్నారో ఎవరు లయము చేస్తున్నారో ఈ సృష్టి అంతా ఎవరు నిండి వున్నారో అటువంటి పరమాత్మను గజేంద్రుడు శరణు వేడినాడు. సృష్ఠి స్థితి లయ కారుడైన ఆ పరమాత్మను గజేంద్రుడు శరణు వేడినాడు. మోక్షమును పొందాడు. గజరాజు విష్ణు రూపుడై వెలుగు చుండె అని పోతన గారు అందుకే వ్రాసారు.