1, జనవరి 2026, గురువారం

satya datta vratamu

 

శ్రీదత్త

శ్రీ సత్య దత్త వ్రత పూజా విధానము

            సత్యనారాయణ వ్రతమునకు వలెనే పూజా ద్రవ్యముల సమకూర్చు కొనవలయును.  ఆసనమునందు కూర్చుని ఆచమనము చేసి, ప్రాణాయామమాచరించ వలెను.  సుముఖశ్చైక దంతైశ్చ... అని దేశకాల సంకీర్తనము చేసి మమ సమస్త సంభావిత దురితక్షయపూర్వక సకల మనోవాంఛిత ఫల సిద్ధ్యర్ధం యధామిళితోపచారైః (పురుష సూక్తాది మంత్రైః) శ్రీ సత్యదత్తస్య సాంగస్య సపరివారస్య పూజనం కరిష్యే... అని సంకల్పము చేయవలయును. 

            తత్రాదౌ నిర్విఘ్నతా సిద్ధ్యర్ధం గణపతి పూజనం, కలశాద్యారాధనం, శరీరశుద్ధ్యర్ధం షడంగన్యాసాంశ్చ కరిష్యే.... అని సంకల్పించి పూజా పీఠము నందు గణపతి పూజ మున్నగునవి చేయ వలయును.  (తరువాత ఆదిత్యాది నవగ్రహములను లోకపాలకులను పూజించ వలెను. 

            తరువాత (తూర్పున) పీఠప్రాగ్ద్వారే ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, (దక్షిణమునందు) దక్షిణే ఓం పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, (పశ్చిమమున) పశ్చిమే ఓం రతీకందార్పాభ్యాం నమః, (ఉత్తరమున) ఉత్తరే ఓం భూవరాహాభ్యాం నమః, (మధ్య) మధ్యే ఓం నమో భగవతే దత్తాత్రేయాయ అని సత్య దత్త దేవుని యంత్రమునందు కానీ, విగ్రహమునందుకానీ, గురుపాదుకలందుగానీ, సాలగ్రామమునందు మున్నగు వాటియందు గానీ ఆవాహనము చేయవలయును.  తరువాత పూజ ఇటుల జరిపించవలయును. 

            శ్రీదత్తం ఖేచరీ ముద్రాముద్రితం యోగి సద్గురుం |

            సిద్ధాసనస్థం ధ్యాయేభీవరప్రదకరం హరిం  ఇతి ధ్యానం ||

            ఓం సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షస్సహస్రపాత్‌

            సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులమ్‌ ||

            దత్తాత్రేయాహ్వాయామ్యత్ర పరివారైః సహార్చనే శ్రద్ధా భక్త్యేశ్వరాగచ్ఛ ధాత ధామ్నాంజసా విభో! ఇత్యావాహనం ||

            ఓం పురుష ఏవేదగ్‌ం   సర్వమ్‌యద్భూతం యచ్చ భవ్యమ్‌

            ఉతామృతత్వ స్యేశానః యదన్నేనాతిరోహతి ||

            సౌవర్ణం రత్న జడితం కల్పితం దేవతా మయం రమ్యం సింహాసనం దత్త తత్రోపవిశ

            యంత్రితే ఇత్యాసనం ||

            ఓం ఏతావానస్య మహిమా అతో జ్యాయాగ్‌శ్చ పూరుషః

            పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి ||

            పాద్యం చందన కర్పూరసురభి స్వాదువారితే గృహాణ కల్పితం తేన దత్తాంఘ్రి క్షాలయామి తే ||

            ఇతి పాద్యం ||

            ఓం త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః పాదో-స్యేహాభవాత్పునః

            తతో విష్వజ్వ్యక్రామత్‌ సాశనానశనే అభి ||

            గంధాబ్జ తులసీ బిల్వ శమీ పత్రాక్షతాన్వితం  సాంబర్ఘ్యం స్వర్ణ పాత్రేణ కల్పితం దత్త గృహ్యతాం

            ఇత్యర్ఘ్యం ||

            ఓం తస్మాద్విరాడజాయత  విరాజో అధి పూరుషః

            సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి మథో పురః ||

            సుస్వాద్వాచమనీయాంబు హైమపాత్రేణ కల్పితం తుభ్యమాచ్యతాం దత్త మధుపర్కం గృహాణ

            చ ఇత్యాచమనీయం మధుపర్కంచ సమర్పయామి||

            ఓం యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమత్వన్వత

            వసంతో అస్యా-సీదాజ్యమ్‌ గ్రీష్మ ఇధ్మ శ్శరద్ధవిః ||

            ప్రవచనాది సుదుర్లభతా శ్రుతేస్త్య్రదిపతే త ఇహశ్రుతి విశ్రుతే పరమ భక్తి సుశీతల సజ్జం వపుషి

            సిక్త మథాప్లుత యేస్త్వలం || ఇతిస్నానం ||

            ఓవ ఆప్యాయ ...... కామాధేను ....  ఇతి పయః స్నానం || పురుషసూక్తము, రుద్రము, పవమాన శ్రీసూక్తములు మున్నగు వాటిచే అభిషేకము చేయవలయును.  స్నానము తరువాత దేవుని పీఠమున నుంచవలెను. 

            ఓం తం యజ్ఞం బర్హి ప్రౌక్షన్న్‌ పురుషం జాత మగ్రతః

            తేన దేవ అయజంత సాధ్యా ఋషయశ్చ యే ||

            భక్త్యా దిగంబరాచాంతజలేదం దత్త కల్పితం కాషాయ పరిధానం తద్‌ గృహణైణేయ చర్మచ ||

            ఇతి వస్త్రం ||

            ఓం తస్మాద్యజ్ఞాత్సర్వహుతః సంభృతం పృషదాజ్యమ్‌

            పశూగ్‌స్తాగ్‌శ్చక్రే వాయవ్యాన్‌ ఆరణ్యాన్‌ గ్రామ్యాశ్చ యే ||

            నానా సూత్రధరై తేతే బ్రహ్మసూత్రే ప్రకల్పితే గృహాణ దైవతమయే శ్రీదత్త నవతంతుకే || ఇతి యజ్ఞోపవీతం ||

            ఓం తస్మాద్యజ్ఞత్సర్వహుతః ఋచస్సామాని జజ్ఞిరే

            ఛందాగ్‌ంసి జజ్ఞిరే తస్మాత్‌ యజుస్తస్మాదజాయత ||

            భూతి మృత్స్నాసు కస్తూరి కేశరాన్విత చందనం రత్నాక్షతాః కల్పిస్త్వామలంకుర్వేథ దత్త తైః ఇతి చందనం అక్షతాంశ్చ ||

            ఓం హరిద్రా .....  హరిద్రా రంజిత ...|| ఇతి హరిద్రాం || కుంకుమం కామదం .... ఇతి కుంకుమం నానా పరిమళ ద్రవ్యాణిచ ||

            ఓం తస్మాదశ్వా  అజాయంత యేకే చో భయాదతః

            గావో హ జజ్ఞిరే  తస్మాత్‌ తస్మాజ్జాతా అజావయః ||

            సచ్ఛమీ బిల్వ తులసీ పత్రైః సౌగంధికైః సుమైః మనసా కల్పితైర్నానావిధైర్దత్తార్చయామ్యహమ్‌ || ఇతిపుష్పాణి||

తరువాత అష్టోత్తర శతనామాలతో పూలు, తులసి, మారేడు పత్రి, జమ్మి పత్రి మున్నగు వాటిచే నర్చించ వచ్చును.  దీని తరువాత ఆవరణపూజ చేయ వలెను.

            ఓంకారతత్వరూపాయ దత్తాత్రేయాయ నమః      

            దివ్యజ్ఞానాత్మనే దత్తాత్రేయాయ నమః

            నభోతీత మహాధామ్నే దత్తాత్రేయాయ నమః       

            ఐంద్య్రర్థ్యా ఓజసే దత్తాత్రేయాయ నమః

            నష్టమత్సరగమ్యాయ దత్తాత్రేయాయ నమః        

            ఆగమ్యాచారవర్త్మనే దత్తాత్రేయాయ నమః

            మోచితామేథ్యకృతయే దత్తాత్రేయాయ నమః

            హ్రీం బీజ శ్రాణిత శ్రియే దత్తాత్రేయాయ నమః

            మోహాది విభ్రమాంతాయ దత్తాత్రేయాయ నమః

            బహుకాయ ధరాయ దత్తాత్రేయాయ నమః

            భక్త దుర్వైభవచ్ఛేత్రే దత్తాత్రేయాయ నమః

            క్లీం బీజవరజాపినే దత్తాత్రేయాయ నమః

            భవహేతు వినాశాయ దత్తాత్రేయాయ నమః

            రాజచ్ఛోణా ధరాయ దత్తాత్రేయాయ నమః

            గతిప్రకంపితాండాయ దత్తాత్రేయాయ నమః

            చారువ్యాయత బాహవే దత్తాత్రేయాయ నమః

            గతగర్వ ప్రియాయ దత్తాత్రేయాయ నమః

            యమాది యతచేతసే దత్తాత్రేయాయ నమః

            వసితాజాత వశ్యాయ దత్తాత్రేయాయ నమః

            ముండినే దత్తాత్రేయాయ నమః

            అనసూయవే దత్తాత్రేయాయ నమః

            వదద్వరేణ్యవాగ్జాలావిస్పష్టవివిధాత్మనే దత్తాత్రేయాయ నమః

            తపోధన ప్రసన్నాయ దత్తాత్రేయాయ నమః

            ఇడాపతిస్తుత కీర్తయే దత్తాత్రేయాయ నమః

            తేజోమణ్యంతరంగాయ దత్తాత్రేయాయ నమః

            అద్మరసద్మ విహాపినే దత్తాత్రేయాయ నమః

            అంతరస్థానసంస్థాయ దత్తాత్రేయాయ నమః

            ఐశ్వర్యశ్రౌతగీతయే దత్తాత్రేయాయ నమః

            వాతాది భయయుగ్భావహేతవే దత్తాత్రేయాయ నమః

            హేతు హేతవే దత్తాత్రేయాయ నమః

            జగదాత్మాత్మభూతాయ దత్తాత్రేయాయ నమః

            విద్విషత్షట్కఘాతినే దత్తాత్రేయాయ నమః

            సురవర్గోద్ధృతే దత్తాత్రేయాయ నమః

            భూత్యై దత్తాత్రేయాయ నమః

            అసురావాసభేదినే దత్తాత్రేయాయ నమః

            నేత్రే దత్తాత్రేయాయ నమః

            నయనాక్ష్ణే దత్తాత్రేయాయ నమః

            అచిచ్ఛేతనాయ దత్తాత్రేయాయ నమః

            మహాత్మనే దత్తాత్రేయాయ నమః

            దేవాధిదేవదేవాయ దత్తాత్రేయాయ నమః

            వసుధాసురపాలినే దత్తాత్రేయాయ నమః

            యాజినాం అగ్రగణ్యాయ దత్తాత్రేయాయ నమః

            ''ద్రాం'' బీజజపతుష్టాయ దత్తాత్రేయాయ నమః

            వాసనవానదావాయ దత్తాత్రేయాయ నమః

            ధూళియుగ్దేహమాలినే దత్తాత్రేయాయ నమః

            యతిసన్న్యాసిగతయే దత్తాత్రేయాయ నమః

            దత్తాత్రేయేతి సంవిదే దత్తాత్రేయాయ నమః

            యజనాస్యభుజే దత్తాత్రేయాయ నమః

            అజాయ దత్తాత్రేయాయ నమః

            తారకావాసగామినే దత్తాత్రేయాయ నమః

            మహాజవాస్పృగ్రూపాయ దత్తాత్రేయాయ నమః

            ఆత్తాకారాయ దత్తాత్రేయాయ నమః

            విరూపిణే దత్తాత్రేయాయ నమః

            నరాయ దత్తాత్రేయాయ నమః

            ధీప్రదీపాయ దత్తాత్రేయాయ నమః

            యశస్వియశసే దత్తాత్రేయాయ నమః

            హారిణే దత్తాత్రేయాయ నమః

            ఉజ్వలాంగాయదత్తాత్రేయాయ నమః

            అత్రేస్తనూజాయ దత్తాత్రేయాయ నమః

            శంభవే దత్తాత్రేయాయ నమః

            మోచితామరసంఘాయ దత్తాత్రేయాయ నమః

            ధీమతాంధీకరాయ దత్తాత్రేయాయ నమః

            బలిష్ట విప్రలభ్యాయ దత్తాత్రేయాయ నమః

            యాగహోమ ప్రియాయ దత్తాత్రేయాయ నమః

            భజన్మహిమవిఖ్యాత్రే దత్తాత్రేయాయ నమః

            అమరారి మహిమచ్చిదే దత్తాత్రేయాయ నమః

            లాభాయ దత్తాత్రేయాయ నమః

            ముండిపూజ్యాయ దత్తాత్రేయాయ నమః

            యమినే దత్తాత్రేయాయ నమః

            హేమమాలినే దత్తాత్రేయాయ నమః

            గతోపాధివ్యాధయే దత్తాత్రేయాయ నమః

            హిరణ్య హితకాంతయే దత్తాత్రేయాయ నమః

            యతీన్ద్రచర్యాందధతే దత్తాత్రేయాయ నమః

            నరభావౌషధాయ దత్తాత్రేయాయ నమః

            వరిష్ఠయోగిపూజ్యాయ దత్తాత్రేయాయ నమః

            తంతుసంతన్వతే దత్తాత్రేయాయ నమః

            స్వాత్మగాథాసుతీర్ధాయ దత్తాత్రేయాయ నమః

            మశ్రియే దత్తాత్రేయాయ నమః

            షట్కరాయ దత్తాత్రేయాయ నమః

            తేజోమయోత్తమాంగాయ దత్తాత్రేయాయ నమః

            నోదనానోద్యకర్మణే దత్తాత్రేయాయ నమః

            హాన్యాప్తి మృతివిజ్ఞాత్రే దత్తాత్రేయాయ నమః

            ఓంకారిత సుభక్తాయే దత్తాత్రేయాయ నమః

            రుక్శుఙ్మనః ఖేదహృతే దత్తాత్రేయాయ నమః

            దర్శనావిషయాత్మనే దత్తాత్రేయాయ నమః

            రాంకవాతత వస్త్రాయ దత్తాత్రేయాయ నమః

            నరతత్త్వ ప్రకాశినే దత్తాత్రేయాయ నమః

            ద్రావిత ప్రణతాఘాయ దత్తాత్రేయాయ నమః

            ఆత్తస్వజిష్ణుస్వరాశయే దత్తాత్రేయాయ నమః

            రాజత్త్య్రాస్యైక రూపాయ దత్తాత్రేయాయ నమః

            మస్థాయ దత్తాత్రేయాయ నమః

            మసుబన్ధవే దత్తాత్రేయాయ నమః

            యతయే దత్తాత్రేయాయ నమః

            చోదనాతీత ప్రచార ప్రభవే దత్తాత్రేయాయ నమః

            మానరోషవిహీనాయ దత్తాత్రేయాయ నమః

            శిష్య సంసిద్ధికారిణే దత్తాత్రేయాయ నమః

            గన్త్రే దత్తాత్రేయాయ నమః

            పాదవిహీనాయ దత్తాత్రేయాయ నమః

            చోదనా చోదితాత్మనే దత్తాత్రేయాయ నమః

            యవీయసే దత్తాత్రేయాయ నమః

            అలర్క దుఃఖవారిణే దత్తాత్రేయాయ నమః

            అఖండితాత్మనే దత్తాత్రేయాయ నమః

            హ్రీంబీజాయ దత్తాత్రేయాయ నమః

            అర్జునేష్టాయ దత్తాత్రేయాయ నమః

            దర్శనా దర్శితాత్మనే దత్తాత్రేయాయ నమః

            నతిసంతుష్ట చిత్తాయ దత్తాత్రేయాయ నమః

            యతినే దత్తాత్రేయాయ నమః

            బ్రహ్మచారిణే దత్తాత్రేయాయ నమః

            త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ నృశింహ సరస్వతీ స్వామినే నమః

            అద్య .... తిథౌ శ్రీ సత్య దత్తవ్రతాంగత్వేన ఆవరణ దేవతా పూజానం  కరిష్యే || అని సంకల్పించి ఆయా దేవతలను పూజింపవలెను. 

            ఓం శీక్షాయై నమః ఓం కల్పాయై నమః ఓం వ్యాకరణాయ నమః ఓం నిరుక్తాయ నమః ఓం జ్యోతిషాయ నమః ఓం ఛందసే నమః ఓం వహ్నయే నమః ఓం ఈశాయ నమః ఓం రక్షసే నమః ఓం వాయవే నమః

            శ్లో ||      దయాబ్దే త్రాహి సంసార సర్పాన్మాం శరణాగతం

                        భక్త్యా సమర్పయే తుభ్యం ప్రథమావరణార్చనం  అని ప్రతి పర్యాయము అక్షతలు, నీళ్ళువిడువ వలెను. 

2వ ఆవరణ||        ఓం ఋగ్వేదాయ నమః  ఓం యజుర్వేదాయ నమః ఓం సామవేదాయ నమః ఓం అథర్వవేదాయ నమః ఓం ఇతిహాస పురాణేభ్యో నమః ఓం మీమాంసాయ నమః  ఓం న్యాయాయ నమః

 

                        శ్లో ||      దయాబ్దే త్రాహి సంసార సర్పాన్మాం శరణాగతం

                                    భక్త్యా సమర్పయే తుభ్యం ద్వితీయావరణార్చనం

           

            3. ఆవరణ|| ఓం సరస్వత్యైనమః, ఓం గణపతయేనమః, ఓం శుకాయనమః, ఓం సుమంతవే నమః ఓం జైమినయే నమః, ఓం వైశంపాయనాయ నమః, ఓంపైలాయ నమః, ఓం గోభిలాయ నమః,

            శ్లో         దయాబ్దేత్రాహి సంసార సర్పాన్మాం శరణాగతం

                        భక్త్యా సమర్పయే తుభ్యం తృతీయావరణార్చనం

            4 ఆవరణ||  ఓం కశ్యపాయ నమః, ఓం ఆత్రయే నమః, ఓం భరద్వాజాయ నమః, ఓం విశ్వమిత్రాయ నమః, ఓం గౌతమాయనమః, ఓం జమదగ్నయే నమః, ఓం వశిష్ఠాయ నమః, ఓం వ్యాసాయ నమః,

            శ్లో||       దయాబ్దే త్రాహి సంసార సర్పాన్మాం శరణాగతం

                        భక్త్యా సమర్పయే తుభ్యం చతుర్థావరణార్చనం

            5ఆవరణ|| ఓం అణిమాయై నమః, ఓం మహిమాయై నమః, ఓం గరిమాయై నమః, ఓం లఘిమాయై నమః, ఓం ప్రాప్త్యై నమః, ఓం ప్రాకామ్యాయనమః, ఓం ఈశిత్వాయ నమః, ఓం వశిత్వాయ నమః.

            శ్లో||       దయాబ్దే త్రాహి సంసార సర్నాన్మాం శరణాగతం

                        భక్త్యా సమర్పయే తుభ్యం పంచమావరణార్చనం

            6ఆవరణ||  ఓం నందనాథాయ నమః, ఓం మత్స్యేంద్రాయ నమః, ఓం దలేంద్రాయ నమః, ఓం గోరక్షాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం నాగార్జునాయ నమః, ఓం మేఘనాదాయనమః, ఓం భుజంగాయ నమః, ఓం కురునాయకాయ నమః,ఓం భైరవాయ నమః.

            శ్లో||       దయాబ్ధే త్రాహి సంసార సర్పాన్మాం శరణాగతం

                          భక్త్యా సమర్పయే తుభ్యం షష్ఠావరణార్చనం.  

            7 ఆవరణ||  ఓం ఇంద్రాయ నమః  ఓం ఆగ్నేయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరృతయే నమః ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం కుబేరాయ నమః, ఓం ఈశాయ నమః,

              శ్లో||     దయాబ్ధే త్రాహి సంసార సర్పాన్మాం శరణాగతం

                        భక్త్యా సమర్పయే తుభ్యం సప్తమావరణార్చనం.

            అనేన ఆవరణ దేవతా పూజనేన .........శ్రీ దత్తస్సుప్రీణాతు.

            ఓం యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్‌ |

            ముఖం కిమస్య కౌబాహూ కావూరూ పాదావుచ్యేతే ||

            లాక్షాసితాభ్ర  శ్రీవాస శ్రీ ఖండాగరు గుగ్గులైః ||

యుక్తోగ్ని యోజితో ధూపో హీదా స్వీకుదు దత్తతం ఇతి ధూపం ||  

            ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్‌ బాహూరాజన్యః కృతః

            ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగ్‌ం శూద్రో అజాయత ||

            స్వర్ణ పాత్రే గోఘృతాక్త వర్తి ప్రజ్వలితం హృదా దీపం  దత్త సకర్పూరం గృహాణ స్వప్రకాశక ఇతి దీపం.

            ఓం చంద్రామా మనసో జాతః చక్షో స్సూర్యో అజాయత |

            ముఖాదింద్ర శ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయు రజాయత ||

            సషడ్రరసం షడ్విధాన్న నైవేద్యం గవ్య సంయుతం కల్పితం హైమ పాత్రే తే భుంక్ష్వ దత్తాంబ్వదః పిబ ఇతి నైవేద్యం.  త్రీశతేద్య పరభక్తి వీటికా పంచమైక పురుషార్ధ సాధికా నిర్వికల్పక సమాధితః పురా రంజికాస్తు భవ భంజికా వరా ఇతి తాంబూలం హిరణ్యం గర్భేతి దక్షిణాం ఇదం ఫలమితి ఫలాని.

            ఓం శ్రియేజాతః కర్పూరేణ మనోహరే ఇతి నీరాజనం 

            ఓం నాభ్యా  ఆసీదంతరిక్షమ్‌ శీర్ష్ణో ద్యౌ స్సమవర్తత |

            పద్భ్యాం భూమిర్దిశశ్శోత్రాత్‌ తధా లోకాగ్‌ం అకల్పయన్‌ ||

            స్వ ప్రకాశః ప్రకాశాత్మా పరమాత్మా పరాత్పరః ఇతి ప్రదక్షిణాః 

            ఓం సప్తాస్యా...........  నమో గురుభ్యో గురుపాదుకాభ్యో నమః  పరేభ్యః  పరపాదుకాభ్యః  ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమోస్తు లక్ష్మీపతి పాదుకాభ్యః ఇతి నమస్కారాన్‌ ||

            ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా తాని ధర్మాణి ప్రథమా న్యాసన్‌

            తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః ||

            రాజాధి రాజయాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే

            స మే కామా న్కామ కామాయ మహ్యమ్‌ కామేశ్వరో వైశ్రవణో దదాతు |

            కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః||

            ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహీ తన్నో దత్తఃప్రచోదయాత్‌ ||

            మంత్ర వన్నిహితోమూర్ధ్ని దత్తతే కుసుమాంజలిః కల్ప్యంతే మనసా గీత వాద్యననృత్యోపచారకాః ఇతి మంత్ర పుష్పాంజలిం రాజోపచారాంశ్చ  సమర్పయామి. 

            అథ ప్రార్ధనా

            త్వత్ప్రేమమభక్త్యై సదా మదాత్మా ధియా ధియం దృష్టి మపీశదృష్ట్యా అంగైః సదాంగాని దృఢం దయాబ్దే హరే నిబఘ్నంత్వితి మేస్తి యాచ్ఞా ||

            ఆసకృదభిహితా తేనేక జన్మాప్త పుణ్యైః ప్రణతివితతిరేషా-ద్వైత శేషావిశేషా త్వయి వినిహితమేతన్మేద్య సర్వం స్వకీయం త్య్రధిప జయతు పూజా త్వద్యశోమాలినీయం. 

            మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||  యస్యస్మృత్యాచ నమోక్త్యా తపఃక్రియాదిషు న్యూనం సంపూర్ణం యాతి సద్యో వంద్యో తమచ్యుతం || ఇతి ప్రార్ధనా

            అనేన యథోక్త పూజనేన శ్రీసత్యదత్తః సాంగః సపరివారః ప్రీయతామ్‌ ఇతి పూజావిధిః||

 

శ్రీసత్య దత్తవ్రత కథ

గణపతయే నమః శ్రీ దత్త జయ

            దీపకుడను భక్తుడు వేద ధర్ముడను గురువును సేవించి వారి అనుగ్రహమునకు పాత్రుడై ఇట్లు వారిని ప్రశ్నించుచున్నాడు.  సిద్ధుల చేత నుతింపబడు దత్తాత్రేయ చరిత్రమును వారి మహామహాత్మ్యము సర్వోత్తమమని పెద్దలు చెప్పెదరు. తమరు దయ యుంచి వారి మహాత్మ్యమును సెలవిండని ప్రార్ధింప వేదధర్ముడు దీపకునితో ఇట్లు చెప్పదొడగెను.  దీపకా! నీకు దత్తాత్రేయ మహాత్మ్యమును విన సంకల్పమయినది.  సంతోషము, నీవు ధన్యుడవు.  నీకు సత్యదత్త వ్రతముపదేశించుచున్నాను.  దానినాచరించుటచే సర్వము తత్కాలమున సిద్ధించును.        

            పూర్వము కలియుగ ప్రారంభమున నైమిశారణ్యమన శౌనకాదులు సత్రయాగమొనర్చుచుండ సూతులవారచ్చటకు వచ్చిరి.  ఋషులు సూతుని సత్కరించి స్వాగతమొనర్చి వారినిట్లు ప్రశ్నించుచున్నారు.  దత్తాత్రేయులవారి భక్తులు వారివలన సర్వాభీష్టముల నొందిరని వింటిమి.  ఇట్టి సర్వానందదాయకమై సర్వసిద్ధిప్రదమయిన శ్రీదత్తాత్రేయవ్రతమును మాకు ఉపదేశించి మమ్ముల ధన్యులచేయుడని ప్రార్ధింప సూతులవారిట్లనుచున్నారు. 

            మహర్షులారా మీరందరు భక్తులగుటచే దత్త మహాత్మ్యమును నేను వినినంత చెప్పెద వినుడు.  త్రిగుణాతీతుడు గాన అత్రియను సార్ధక నామధేయుడై బ్రహ్మమానస పుత్రుడైన అత్రి భార్యా సమేతుడై తపమాచరించు నిమిత్తము ఋక్షమనుకులాద్రికి వెళ్ళెను.  నూఱు సంవత్సరములు భగవంతునితో సముడగు సంతానమపేక్షించి త్రిగుణాత్మకమయిన మాయాశబల బ్రహ్మము నుద్దేశించి అచ్చట జితేంద్రియుడై వాయుభక్ష మొనర్చుచు తపమాచరించెను.  అత్రి తపమునకు ఫలమొసంగగలందులకు బ్రహ్మవిష్ణుమహేశ్వరులు అతని వద్దకు వచ్చి వరమడుగుమనిరి.  అత్రి నేను ధ్యానించిన దేవుడు మీలో ఎవరో చెప్పమనిన మాకు ముగ్గురకు ఆకారములు మాత్రమే వేఱుకాని స్వరూపమొక్కటే.  నీవు మావంటి కుమారుడు కావలయునని తపమాచరించితివి కాన మేము మమ్ములనే నీకు దత్తము చేసితిమని వారంతర్హితులైరి.  అప్పుడు వారి ఎదుట చతుర్భుజుడై దత్తదేవుడావిర్భవించెను.  తాను ఆప్తకాముడైనను భక్తపరాధీనతను ప్రకటించుటకుగాను అత్రి అనసూయలకు పుత్రుడై వారల సంతోషపరచుచుండెను.

            ఇట్లుండ ఒక బ్రాహ్మడుణుడు అన్ని శాస్త్రములు చదివినను మనశ్శాంతి కుదరనందున మనశ్శాంతినుద్ధేశించి దత్తదేవునారాధించుచుండ నొకనాడు దత్తాత్రేయులవారు ఆ బ్రాహ్మణుని ఎదుట ప్రత్యక్షమయి నీవు విచారముగనుండ కారణమేమి అని అడిగిరి.  అప్పుడా బ్రాహ్మణుడు స్వామీ! చదివినకొద్దియు సంశయములు పెరుగుచున్నవి.  ఏమిచేయవలయునో తోచకున్నదనెను.  అప్పుడతనితో దత్తాత్రేయులవారిట్లను చున్నారు.  స్వధర్మమును ఈశ్వరారాధనమను బుద్ధితో నాచరించవలయును.  ఈశ్వరానుగ్రహముచే ఈశ్వరుడే గురురూపమున రాగలడు.  గురు సేవవలన ప్రతిబంధక పాపక్షయము దుష్టవాసనా తిరస్కారము, తద్వారా జ్ఞానము కలుగగలదు.  అన్నిమతములు అన్ని శాస్త్రములు సత్యస్వరూపుడనై, సత్యవ్రతుడనై, సత్యమునకు సత్యమయిన నన్నే ప్రతిపాదించుచున్నది.  నన్ను ధ్యానించి కృతార్ధుడవు కమ్మని చెప్పి దత్తాత్రేయులవారిట్లు తిరిగి ఆ బ్రాహ్మణునితో చెప్పుచున్నారు.  దేవతలందరు నా సచ్చిదానందాంశముతో కూడినవారే.  వారు వారు వారి భక్తులకు స్వాధికారానురూపముగ ఫలముల నొసగెదరు.  కాని నిర్గుణోపాస వలన మనోమాలిన్యము నశించును.  అప్పుడు వాడు నా ప్రసాదమునకు పాత్రుడగును.  నా అనుగ్రహముచే అతని అజ్ఞానము నశించును.  అప్పుడతనికి ముక్తి లభించును కాన సర్వ ధర్మముల విడనాడి నన్ను భజించుము.  నన్ను సర్వాత్మనా శరణు పొందితివేని శాశ్వతమయిన శాంతినొందగలవు.  నన్ను ఆరాధింపుము.  నీకు క్షేమమగుగాక అని చెప్పి దత్తాత్రేయులవారు అంతర్ధానమొందిరి. 

సత్య దత్త వ్రత కథ ఒకటవ అధ్యాయము సమాప్తము.

 

రెండవ అధ్యాయము

 

            సూతులవారు ఇట్లు మహర్షులతో చెప్పుచున్నారు.  మానవుడు తరించవలయునన్న యావజ్జీవము వేదాంత విచారము, గురుసేవ, దేవతారాధనము విడువరాదు.  జ్ఞాన సిద్ధికొఱకు ముందుగాను, జ్ఞానసిద్ధి అయిన తదుపరికూడ కతఘ్నత్వము రాకుండుటకై వేదాంత శాస్త్ర విచారము, గురుభక్తి, ఈశ్వరారాధనము ప్రతివారును అవస్యమాచరించవలయును. 

            ఆ బ్రాహ్మణుడు భక్తితో సత్య దత్త వ్రతమును ప్రతి పౌర్ణిమ, సంక్రాతి, గురువారములందాచరించెను.  సప్తావరణములతో కూడిన దత్త దేవుని కల్పోక్త విధిని పూజించెను.  గోధుమపిండి, నెయ్యి, క్షీరము, పంచదార, ద్రాక్షపండు, ఏలక్కాయలపొడి ఇవిఅన్నియు కలిపి ప్రసాదముగ నైవేద్యమర్పించెను.  యధాశక్తి బ్రాహ్మణ సమారాధన గావించెను.  ఇట్లు చేయుటచే నాబ్రాహ్మణుడు క్రమముగ జ్ఞానియై పునరావృత్తి రహితమైన కైవల్యమునొందెను. 

సత్య దత్త వ్రత కథ రెండవ అధ్యాయము సమాప్తము.

 

మూడవ అధ్యాయము

 

            ఋషులు సూతునిగూర్చి సత్య దత్త వ్రతమహాత్మ్యమును చెప్పవలసినదని ప్రార్ధించ సూతుడిట్లు చెప్పుచున్నాడు. పూర్వము చంద్రవంశమున అయురాజు అను క్షత్రియుడు కలడు.  అతనికి సంతానము లేనందన తపించుచు  తన గురువగు శౌనకుని పుత్రార్ధియై శరణుపొందెను. 

            శౌనకుడు అయురాజుతో నీవు సత్యదత్తవ్రతమును ఆచరించుము నీకు సంతానము కలుగగలదనెను.  ఆరాజు అట్లే శాస్త్రోక్తవిధిని సత్యదత్తవ్రతమాచరించెను.  అప్పుడు వ్రతముచే సంతుష్టుడై అతని భార్య స్వప్నమందు ముత్యములతో కలసిన క్షీరమునొక శంఖముతో నామె శరీరమున చల్లెను.  ఆసంగతి ఆమె తెల్లవారుటతోడనే భర్తతో చెప్పెను.  రాజు ఆ స్వప్నమును గూర్చి శౌనకుని ప్రశ్నించ శౌనకుడు దత్తదేవుడే అట్లొనర్చెను.  మీకు శీఘ్రకాలముననే దత్త భక్తుడై సోమవంశమునకు కీర్తితేగల పుత్రుడు పుట్టగలడని చెప్పెను.  కొలది కాలమునకే  రాజుభార్య గర్భవతి అయ్యెను.  ఈ విషయము తెలిసి స్వర్గోద్యానములో చారణులు అయురాజు భార్య గర్భవతి అయ్యెను.  వారిపుత్రుని చేతిలో హుండాసురుడు హతముకాగలడని చెప్పుకొనుచుండ చెలికత్తెలతో వనవిహార మొనర్చుచున్న హుండాసురుని కుమార్తె ఆమాటవిని హుండాసురునికా వృత్తాంతము చెప్పెను. 

            హుండాసురుడది విని ఆమెగర్భము పోగొట్ట ప్రయత్నించెను గాని అయ్యది దత్తరక్షితమగుటచే అతని ప్రయత్నము విఫలమయ్యెను.  నవమాసములు నిండ అయురాజు భార్యయైన ఇందుమతి శుభముహూర్తమున ఒక బాలుని కనెను.  అప్పుడు హుండాసురుడు మోహినీ విద్యతో నందర వశపరచుకొని ప్రశ్వాపినీ విద్యతో నందర నిద్రపోవునట్లొనర్చి ఒక పరిచారిక రూపమున పురిటింట ప్రవేశించి బాలుని అపహరించి తన కాంచనమను పట్టణమేగి తన భార్యతో ఈ బాలుని వలన నాకు మరణము రాగలదని దేవతలనుకొనుచున్నారు. కావున నీబాలుని ముక్కలుగ కోసి నాకు పలహారముగ చేయించుమని ఆజ్ఞాపించెను. రాణి వంటవానికి ఆ బాలుని అప్పగించి భర్త చెప్పిన సంగతి చెప్పి కార్యాంతరాసక్తి కలదయ్యెను. 

            వంటవాడు, దాసియు ఆబాలుని వంటయింట బల్లమీద నుంచి కత్తితో తెగవేయబోగా కత్తి విరిగెనే కాని దత్తాత్రేయులవారు బాలునిమీద తన సుదర్శన చక్రమును తిప్పుచుండుటచే బాలుడు నవ్వుచునే ఉండెను. 

            అదిచూచి వారు దయగలవారై ఆబాలుడు దైవముచే రక్షించబడిఉన్నాడని గ్రహించి బాలుని దూరముగ నిర్జనారణ్యమున నుంచ పంపి ఏదియో మాంసము పక్వముచేసి హుండాసురునకు మీ ఆజ్ఞప్రకారమే చేసితిమని చెప్పిరి.  హుండాసురుడు సంతసించెను.  వంటయింటి పరిచారిక బాలుని యందు దయగలదై వశిష్ఠమహర్షి యొక్క ఆశ్రమ సమీపమున నొక పొదచాటున బాలుని పడవేసి పోయెను.  వశిష్ఠులవారు తెల్లవారుజామున తన కాలకృత్యములు తీర్చుకొనుటకు అదే మార్గమున పోవుచు ఆబాలుని అచ్చట చూచి విస్మితుడై యోగదృష్టితో ఆ బాలుని వృత్తాంతము తెలుసుకొని అచ్చటి మహర్షుల పిలచి వారితో ఇట్లు చెప్పెను.  ఈ బాలుడు సోమవంశమునకు రాజైన అయురాజునకు దత్తాత్రేయుని ప్రసాదముచే కలిగిన పుత్రుడు.   హుండాసురుడు ఈ బాలుని వలన తనకు మరణము సంప్రాప్తమగునని విని ఈ బాలుని చంప ప్రయత్నించెను గాని దత్తాత్రేయుల కృపచే రక్షించబడి ఇచ్చటకు తేబడెను అని చెప్పి తనచేతులతో ఆ బాలుని ఎత్తుకొని తన ఆశ్రమము సమీపించి తన భార్యఅయిన అరుంధతికి ఆ బాలుని అప్పగించెను.  దేవతలు పుష్పవర్షము కురిపించిరి.  గంధర్వులు గానము చేసిరి.  ఋషులు ఈ బాలుడు దీర్ఘాయుష్మంతుడగు గాక అని ఆశీర్వదించిరి. వశిష్ఠుడు ఆ బాలునకు నహుషుడను నామమిడెను.  అరుంధతి ఆబాలుని ఔరస పుత్రుని వలె ప్రేమతో పోషించుచుండెను.  పదకొండవ సంవత్సరమున వశిష్ఠుడు ఆ బాలునకు ఉపనయనమొనర్చి వేదవేదాంగములందు పారంగుతునిగ చేసెను.  ఇంతేగాక ధనుర్వేదము, జ్ఞానశాస్త్రము, రాజనీతి ఇవి అన్నియు బోధించెను.  నహుషుడు వినయవిధేయతలు గలవాడై మనోవాక్కాయములతో వారినే తల్లి తండ్రులుగా భావించుచుండెను.  ఇట్లు నహుషుడు వశిష్ఠులవారి ఆశ్రమమున సకల విద్యాపారంగతుడయ్యెను. 

సత్య దత్త వ్రత కథ మూడవ అధ్యాయము సమాప్తము.

 

 

నాలుగవ అధ్యాయము

 

            సూతుల వారు ఇట్లు చెప్పుచున్నారు.  భగవంతుడు తన భక్తులను కష్టకాలమున తప్పక రక్షించి కాపాడును.  నహుషుడు ఈ విధమున వశిష్ఠుని ఆశ్రమమున క్షేమముగ నుండెను.  ఋషులారా! హుండాసురుడు బాలుని ఆపహరించి వెడలిన కొలది కాలమునకు రాక్షసుని మంత్రప్రభావము తగ్గిపోయినందున అచ్చటివారందరును నిద్రనుండి లేచినవారివలె మేలుకొనిరి.  ఇందుమతి తన ప్రక్కలో కుమారుని కానక విలపించెను.  ఆయురాజుకు ఆ వృత్తాంతము తెలిసి పురిటింటికి వచ్చి ఇట్లు విలపిపసాగెను.  హా! దైవమా! దత్తాత్రేయుని ప్రసాదమువలన  కలిగిన పుత్రరత్నము ఏమయ్యెను.  ధర్మమునకు తపస్సునకు, దానమునకు ఫలమేలేదా! దీనవత్సలా! మమ్ముల రక్షించి కాపాడుము అని పరిపరివిధముల విలపించుచుండ దత్తాత్రేయులవారి ప్రేరణచే నారదులవారచ్చటికి వచ్చి, అతనిని ఓదార్చి ఇట్లు చెప్పెను.  నీవు దుఃఖించకుము.  హుండాసురుడు నీ బాలుని తన మాయా శక్తితో  అపహరించి వెళ్ళెను.  ఆ బాలుని సంహరింప యత్నించెను.  కాని దైవయోగమున అతని ప్రయత్నము విఫలమయ్యెను.  నీ కుమారుడిప్పుడు ఒక మునివర్యుని ఆశ్రమమున సురక్షితముగ నున్నాడు.  కొంతకాలమునకు ఆరాక్షసుని సంహరించి భార్యా సమేతుడై క్షేమముగ రాగలడు.  ఎంతమాత్రము విచారించకుము అని చెప్పి నారదుడు వెడలెను.  ఆ దంపతులు నారదుని వాక్యము విని దుఃఖము విడనాడి దత్తాత్రేయుల వారి పూజను భక్తిచే జరుపుచు కాలము గడుపుచుండిరి.

            ఇట్లుండ ఒకదినమున వశిష్ఠులవారు నహుషుని పిలిచి ''నీవు ఆయురాజు పుత్రుడవు.  హుండాసురుడు నీ వలన తనకు మరణము రాగలదని తెలిసి నిన్ను పురిటింటి నుండి అపహరించి తెచ్చెను.  కాని దైవకృపచే నీవు ఆ ఆపదనుండి రక్షింపబడి మా ఆశ్రమమునకు రాగలిగితివి.  నీవు క్షత్రియుడవుగాన హుండాసురునితో యుద్ధమొనర్చి అతనిని సంహరింపుము.  దత్తాత్రేయుడు నిన్ను సర్వ విధముల రక్షించి కాపాడగలడు'' అని చెప్పెను.  వశిష్ఠుని వాక్యము విని తనను తల్లి గర్భమున ప్రవేశించినది మొదలు రక్షించి కాపాడిన అత్రినందనుడైన దత్తాత్రేయుని యుద్ధమున తనకు జయము సిద్ధించుకొరకు మనసార ప్రార్ధించి యుద్ధమునకు సన్నద్ధుడయ్యెను.  దేవతలు పుష్పవర్షము కురిపించిరి.  మహర్షులు ఆశీర్వదించిరి.  అదేసమయమునకు దేవేంద్రుడు తన రథమును మాతలి అను తన సారధినిచ్చి నహుషుని నిమిత్తము పంపెను.  దేవతలందరు వారి వారి ఆయుధములతో నహుషునికి సహాయులై ఏతెంచిరి.  ఇట్లు గొప్ప అట్టహాసముతో నహుషుడు హుండాసురుని పట్టణమును ముట్టడించెను.  హుండాసురుడు దూతల ద్వారా అయురాజు కుమారుడు యుద్ధమునకు వచ్చెనని విని భయకంపితుడై తన భార్యతో నీవు నేను తెచ్చిన బాలుని చంపితివా లేదా అని అడిగెను.  మేము ఆనాడే ఆ బాలుని చంపి మీకు ఫలహారముగా పెట్టితి గదా అని అబద్ధమాడెను.  నహుషునకు హుండాసురునకు ఘోరమైన యుద్ధము జరిగెను. ఎట్టకేలకు హుండాసురుని నహుషుడు ఇంద్రాయుధముతో సంహరించెను.  నహుషుడు జయించెను.  అప్పుడు అశోకసుందరి అను కన్యారత్నమును రంభ అను అప్సరస నహుషుని వద్దకు తసికొని వచ్చి ఈమెను నీవు దర్మపత్నిగా స్వీకరించుమని ప్రార్ధించెను. 

            నహుషుడు మా గురువు అనుమతి బడసిన తదుపరి ఈమెను వరించెదననెను.  అందరును  రథమధిష్టించి వశిష్టుని ఆశ్రమము చేరిరి.  వశిష్ఠులవారు సంతసించి అశోకసుందరితో నహుషునకు వివాహమొనర్చెను.  మాతలి తనరథముతో సహ స్వర్గమునకు వెడలెను.  వశిష్ఠులవారు నహుషుని భార్యాసమేతముగ తల్లిదండ్రుల వద్దకు పంపిరి. ఆయురాజు కడు సంతసించి నహుషునకు పట్టాభిషేకమొనర్చి తను భార్యాసమేతముగ  వానప్రస్థాశ్రమము సలిపి చివరకు దత్తాత్రేయులవారితో సాయుజ్యము నొందెను. 

            సూతులవారు ఋషులతో ఋషులారా! సత్యదత్త వ్రత మహిమ వింటిరి కదా!  ఈ వ్రతమొనర్చువారు అర్ధార్ధి అర్ధమును ముముకక్షువు ముక్తిని పొందగలరు.  ఈ వ్రతము ఆచరించువారి ఎట్టి కష్టములు రాజాలవు అని చెప్పిరి. 

సత్య దత్త వ్రత కథ నాలుగవ అధ్యాయము సమాప్తము.

 

అయిదవ అధ్యాయము

 

            శ్రీదత్త. సూతుల వారు శౌనకాదులతో నిట్లనుచున్నారు.  ఈ సత్య దత్తవ్రతము భక్తితో చేయువారికి సర్వాభీష్టముల నొసంగును.  ఇట్టి వ్రతముయొక్క మహాత్మ్యమును తిరిగి చెప్పుచున్నాను.  శ్రద్ధతో వినుడు. 

            గోదావరి తీరమున హరిశర్మయను బ్రాహ్మణుడు కలడు.  అతనికి ఒక కుమారుడు కలడు.  అతని వివాహమైనది మొదలు గుల్మరోగము, క్షయరోగము, జలోదరము, జీర్ణజ్వరము, అతిసారము మొదలగు వ్యాధులు సంభవించెను.  వాతపిత్తశ్లేష్మములు ప్రకోపించి అతని జీవితము ప్రమాదకరముగనుండెను.  అతని భార్య పదహారు సంవత్సరముల వయస్సు కలది.  ఆమె ఆకాలమున దత్తభక్తుడని ప్రసిద్ధికాంచిన విష్ణుదత్తుని శరణుపొంది పతిభిక్ష పెట్టమని ప్రార్ధించెను.  ఆ విష్ణుదత్తుడను భక్తుడు ఆమెయందు దయగలవాడై ఆమె యింటికి వచ్చి ఆమెచే వరుసగా సత్యదత్త వ్రతముల ఆచరింపచేసెను.  ఒక్కొక్క వ్రతము చేసినంత ఒక్కొక్క వ్యాధి తగ్గసాగెను.  అప్పుడా భక్తుడు దత్తాత్రేయ మంత్రముతో మంత్రించిన భస్మముతో అతని హృదయమును స్పృశించెను.  అట్టి వ్రత ప్రభావముచే ఆబాలుడు ఆరోగ్యవంతుడయ్యెను.  పుత్రుల బడసి గొప్ప యశస్సు సంపాదించెను.  ఆముష్మికముగ కూడ సద్గతినొందెను.  సత్యదత్త వ్రతము పాపముల నశింపచేయును.  పుష్టిని భుక్తిని ముక్తినిగూడ నివ్వ సమర్ధమైనది. 

            వేదధర్ముడు దీపకునితో నిట్లనుచున్నాడు.  సూతులవారివలన శౌనకాది మహర్షులు సత్యదత్త వ్రత మహాత్మ్యమును విని వారందరు కలసి ఇట్టి వ్రతమాచరించిరి.  తదుపరి దత్తాత్రేయులవారి దర్శనము కావలయునని  ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానించిరి.  అప్పుడు చక్కని, చల్లని సుగంధపూరితమగు వాయువు వీచెను.  వారి ఎదుట కోటిసూర్యులతో సమానమైన కాంతి ప్రకాశించెను.  మహర్షులు అట్టి తేజఃపుంజమును చూడజాలక కన్నులు మూసి ఓ దేవా! మీ సౌమ్యమైన రూపమును మాకు చూపుమని ప్రార్ధించిరి.  అప్పుడు మీరు కన్నులు తెఱచుడని ఆకాశమున వాక్కు వినబడెను.  అప్పుడు స్వామివారు వారి ఎదుట అవధూత రూపమున దర్శనమిచ్చిరి.  ఋషులు స్వామిని స్తుతించిరి.  అప్పుడు దత్తాత్రేయులవారు తమలో విశ్వమును ప్రదర్శింపచేసిరి.  వారితో నిటుల చెప్పిరి.  మీ భక్తికి తపస్సునకు సంతసించితి.  ఏమియైన వరము కోరుకొనుమనిరి.  వారు స్వామివారిని గూర్చి మాకు మీయందు దృఢమైన భక్తిని అనుగ్రహించుడని ప్రార్ధించిరి.  స్వామివారు వారితో ఇహలోకమున సర్వసౌఖ్యములనొంది దేహాంతము నాసాయుజ్యమునొందగలరని చెప్పి ఈ నా వ్రతమెవ్వరు చేయుదరో వారికి సన్నిపాతము, అక్షిరోగము, కుష్ఠురోగము, క్షయ, మొదలగు వ్యాధులు నశించును. వంధ్య ఆచరించిన పుత్రవతి కాగలదు.  భయగ్రస్తుడు భయరహితుడగును.  దరిద్రుడు ధనవంతుడు కాగలడు.  రోగి ఆచరించిన ఆరోగ్యమునొందగలడు.  ముముకక్షువు ఈ వ్రతమాచరించిన జన్మరాహిత్యమునొందగలడు.  అని చెప్పి అదృశ్యులయ్యిరి.  మహర్షులందరు స్వప్న ద్రష్టమయిన వస్తువు వలె భగవంతుడు అదృశ్యమగుట చూచి ఆశ్చర్యచకితులైరి.  కాన దీపకా! దత్తదేవుడు శరణాగతవత్సలుడు. స్మరించిన మాత్రమున సంతోషించు స్వభావము కలవాడు.  అట్టి భగవంతుడైన దత్తాత్రేయులవారిని సత్యవ్రతముతో పూజించి నీవు ధన్యుడవు కావలసినదని వేదధర్ముడు దీపకుని ఆశీర్వదించి పంపివేసెను. 

సత్య దత్త వ్రత కథయందు అయిదవ అధ్యాయము సమాప్తము.

 

సర్వం శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.

శుభం భూయాత్‌.

మాకశ్చిద్దుఃఖమాప్నుయాత్‌.

ఓం తత్సత్‌.

 

 

 

 

            శ్రీ దత్తాత్రేయ కవచము

            శ్రీపాదః పాతుమే పాదౌ ఊరూ సిద్ధాసనస్థితః

            పాయాద్దిగంబరో గుహ్యం నృహరిః పాతుమే కటిం||

            నాభింపాతు జగత్స్రష్టా ఉదరం పాతు దలోదరః

            కృపాళు పాతు హృదయం షడ్భుజః పాతు మే భుజౌ||

            స్రక్కుండీశూలడమరు శంఖచక్రధరః కరాన్‌

            పాతు కంఠం కంబుకంఠః సుముఖః పాతుమే ముఖం||

            జిహ్వాం మేవేద వాక్పాతు నేత్రం మే పాతు దివ్యదృక్‌

            నాసికాం పాతు గంధాత్మా పాతు పుణ్యశ్రవాః శ్రుతీ||

            లలాటం పాతు హంసాత్మా శిరః పాతు జటాధరః

            కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః||

            సర్వాంతరోంతఃకరణం ప్రాణన్మే పాతు యోగిరాట్‌

            ఉపరిష్టాదధస్తాచ్చ పృష్ఠతః పార్శ్వతోగ్రతః

            అంతర్బహిశ్చ మాం నిత్యం నానారూపధరో-వతు

            వర్జితం కవచేనావ్యాత్‌ స్థానం మే దివ్య దర్శనః||

            రాజతః శత్రుతో హింస్రాత్‌ దుష్ప్రయోగాదితోఘతః

            ఆధివ్యాధి భయార్తిభ్యో దత్తాత్రేయస్సదావతు||

            ధనధాన్య గృహక్షేత్ర స్త్రీపుత్ర పశుకింకరాన్‌

            జ్ఞాతీంశ్చ పాతుమే నిత్య మనసూయానన్దవర్ధనః

            బాలోన్మత్త పిశాచాభోద్యునిట్‌ సంధిషు పాతుమామ్‌

            భూతభౌతిక మృత్యుభ్యో హరిః పాతు దిగంబరః||

            యయేతద్దత్త కవచం సన్నహ్యాత్‌ భక్తిభావితః

            సర్వానర్ధ వినిర్ముక్తో గ్రహపీడా వివర్జితః||

            భూత ప్రేత పిశాచాద్యైః దేవైరప్య పరాజితః

            భుక్త్వాత్రదివ్యాన్‌ భోగాన్‌ సః దేహాన్తే తత్పదం వ్రజేత్‌||

 

ఇతి శ్రీ పరమహంస పరివ్రాజక శ్రీ వాసుదేవానంద సరస్వతీ విరచితం దత్తకవచమ్‌ సంపూర్ణమ్‌||

 

బాలాశిషః

 స్వాం శేనేదం తతం యేన స త్వమీశాత్రినందన|

ముంచ ముంచ విపద్భ్యోమం రక్ష రక్ష హరే శిశుమ్‌||

ప్రాతర్మధ్యందినే సాయం నిశిచాప్యవ సర్వతః|

దుర్దృగ్గోధూలి భూతార్తి గృహమాతృగ్రహాదికాన్‌||

ఛింది ఛింద్యఖిలారిష్టం కమండల్వరిశూలధృక్‌|

త్రాహి త్రాహి విభో నిత్యం త్వద్రక్షాలంకృతమ్‌ శిశుమ్‌ ||

సుప్తం స్థితం చోపవిష్టం గచ్ఛంతం క్వాపి సర్వతః|

భో దేవావశ్వినావేష కుమారో వామనామయః|

దీర్ఘాయురస్తు సతతం సహ ఓజో బలాన్వితః ||

ఇతి బాలా శిషః

పిల్లలకు ఆరోగ్యముగా లేనప్పుడు ఈ పై శ్లోకము 10 సార్లు పఠించి మంత్రించిన భస్మము రాయవలెను.  ఆరోగ్యము కలుగ గలదు.

శ్రీ దత్తశ్శరణం మమ

పుస్తక పూజ

            గురుచరిత్రము పారాయణ చేయువారు స్నానమొనర్చి శుచిర్భూతులై కులానుక్రమముగ సంప్రాప్తమయిన సంధ్యావందనము మొదలగు నిత్యకర్మల యథాశక్తి చేసి సూర్యునకు, గణపతికి, గురుమూర్తికి, నమస్కారములర్పించి ఆసనము మీద కూర్చుని  గురుచరిత్రమును కాని శ్రీ దత్తాత్రేయులవారి చిత్ర పటమును కానీ, విగ్రహముకానీ లేక వారి పాదుకలుగానీ తమ కభిముఖముగ పీటమీదనుంచి పూజాద్రవ్యముల కుడి ప్రక్కన ఉంచుకొని ఈ క్రింద విధముగ గ్రంధమునకు పూజచేసి అనంతరము యథాశక్తి ఒక అధ్యాయమునకు తక్కువ లేకుండా పారాయణము చేయవలయును.  నిత్యము పారాయణము చేయు నియమముగలవారు ఒకరోజున ఏమియైన ఇబ్బందివలన పారాయణము జరుగనిచో ఆరోజు పారాయణము మరురోజున కలిపి చేయవచ్చును.  దత్తాత్రేయ మంత్రము గురుముఖమున ఉపదేశము పొంది జపించుట శ్రేయస్కరము. 

            ఆచమ్య.  3సార్లు ఆచమనమొనర్చి సంకల్పము చెప్పుకొని ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సకలాభీష్ట సిద్ధ్యర్ధం........నామధేయః అహం గురుచరిత్ర పారాయణం కరిష్యే అని చెప్పి ఉదకమును స్పృశించవలయును.  ముందుగ  శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోప శాంతయేత్‌  అని గణపతి ప్రార్ధన చేసి ఒక పుష్పము తీసికొని గురుచరిత్రమును త్రిమూర్త్యాత్మక శ్రీదత్తాత్రేయులవారిగా  భావించి గురుచరిత్రాకారేణ త్రిమూర్త్యాత్మక శ్రీదత్తాత్రేయ పరబ్రహ్మణే నమః.  ధ్యాయామి.. ధ్యానం సమర్పయామి.

            దత్తాత్రేయం గురుం శాంతం అవధూతం దిగంబరం

            భక్తాభీష్టప్రదం వందే గ్రంథరూపేణ సంస్థితం||

(పటము, విగ్రహము లేక పాదుకల పూజించునప్పుడు పైశ్లోకము నాలుగవ పాదమును ''దేవదేవేశమవ్యయం'' అని పలుకుచు గురుచరిత్రము మీద ఉంచవలయును)

(1)  సువర్ణవర్ణస్వర్వాత్మా త్వమేకోసి జగద్గురో గురుచరిత్రాత్మక శ్రీ దత్తాత్రేయ పరబ్రహ్మణేనమః ధ్యాయామి.

(2)       యేషుయేషు చ భావేషు భక్త్యా త్వాం పరమేశర సాధవోభావ యన్త్యాత్మా త్వం తథా తత్ర భాససే శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ దత్తాత్రేయ పరబ్రహ్మణేనమః రత్నఖచిత దివ్యసింహాసనం సమర్పయామి.

(3)       సర్వతః పాణిపాదాయ నమః పాద్యం సమర్పయామి.

(4)       త్వమేవ సర్వయోగానాం భోక్తా సాక్షీ జగద్గురుః హస్తేషు అర్ఘ్యం సమర్పయామి.

(5)       అమృతాదమృతం మర్త్యాః భజన్తి త్వాం జగత్పతే ముఖే ఆచమనీయం సమర్పయామి.

(6)       అసంగోహ్యమరః సాక్షీ  నిత్య సిద్ధో నిరామయః స్నానం సమర్పయామి.

(7)       స్వమాయయా ప్రసుప్తాత్మా మాయా నాశ్రయ మోహినీ వస్త్రం సమర్పయామి.

(8)       బ్రహ్మనామకసూత్రంతు బ్రహ్మసూత్రం ప్రకీర్తితం యజ్ఞోపవీతం సమర్పయామి.

(9)       ఉత్తమం  పూరుషం పూర్ణం, సుగన్ధం సుష్టివర్ధనం గంధం సమర్పయామి.

(10)     అతర్క్యోయమనంతోయమక్షరః పరమేశ్వరః అక్షతాన్‌ సమర్పయామి.

(11)     నానశ్చర్యమయం దేవ నానా సుష్పై సుపూజితం భక్తకల్పద్రుమం వందే శ్రీ దత్తం కరుణానిధిమ్‌ పుష్పైః పూజయామి.

            శ్రీపాదాయ నమః               -          పాదౌపూజయామి

            సిద్ధాసన స్థితాయ నమః        -          కటింపూజయామి

            దలోదరాయనమః               -          ఉదరంపూజయామి

            కృపాళవేనమః                   -          హృదయంపూజయామి

            షడ్భుజాయనమః                -          కరాన్‌పూజయామి

            కంబుకంఠాయనమః           -          కంఠంపూజయామి

            సుముఖాయనమః               -          ముఖంపూజయామి

            సర్వాత్మనేనమః                  -          సర్వాణ్యంగాని పూజయామి

(1)       ఓంకారతత్త్వరూపాయనమః

(2)       దివ్యజ్ఞానాత్మనేనమః

(3)       నష్టమత్సరగమ్యాయనమః

(4)       బహుకాయధరాయనమః

(5)       గతగర్వప్రియాయనమః

(6)       తపోధనప్రసన్నాయనమః

(7)       జగదాత్మనేనమః

(8)       మహాత్మనేనమః

(9)       ద్రాంబీజజపసంతుష్టాయనమః

(10)     వాసనావనదావాయనమః

(11)     ధూళియుగ్దేహమాలినేనమః

(12)     ధీప్రదీపాయనమః

(13)     అత్రేస్తనూజాయనమః

(14)     యాగహోమప్రియాయనమః

(15)     యతీంద్రచర్యాందధతే నమః

(16)     తంతుసంతన్వతేనమః

(17)     నరతత్త్వప్రకాశకాయనమః

(18)శ్రీగురుచరిత్రాత్మక శ్రీనరసింహసరస్వతీ శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ పరబ్రహ్మణేనమః పుష్పాణి సమర్పయామి.

                    ధూపం సమర్పయామి

            దీపం సమర్పయామి

            నైవేద్యం సమర్పయామి.

            ఏమియైన నివేదనము చేసి ఉదకము పాత్రలో ముందు ఉంచి మధ్యేమధ్యే ఉదకపానీయం సమర్పయామి అని చెప్పవలయును.

                    తాంబూలము, యథాశక్తి దక్షిణయు పెట్టి అనంతరము నీరాజనము (హారతి) ఇవ్వవలయును. 

            త్రిగుణాత్మక త్రైమూర్తి దత్తాహాజాణా

                    త్రిగుణీఅవతార త్రైలోక్యరాణా

                    నేతీనేతీ శబ్దనయే అనుమానా సురవరముని

                    జనయోగీ సమాధి నయేధ్యానా జయదేవ జయదేవ

                    జయసద్గురు దత్తా హారతీ ఓవాళిత హారతి భయచింతా

            పుష్పములు చేతిలో తీసికొని

            అవధూతాయ విద్మహే అత్రిపుత్రాయ

                    ధీమహీ తన్నో దత్తః ప్రచోదయాత్‌

            అని పుష్పములు పుస్తకముమీద ఉంచి నమస్కారము చేసి యథాశక్తి గురుచరిత్రము పారాణమొనర్చి పారాయణము పూర్తి అయిన తదుపరి అక్షింతలు చేతితో తీసికొని అనేన గురుచరిత్ర పారాయణేన  శ్రీగురుదత్తాత్రేయ స్సుప్రీణాతు అనినీరు పళ్ళెములో వదలి ఉదకము తీర్ధముగా తీసికొనవలయును. 

శ్రీదత్తస్తవ స్తోత్రము

 

   (1)       నమస్తే భగవాన్‌ దేవత్తాత్రేయ జగత్ప్రభో

               సర్వబాధాప్రశమనం కురుశాన్తిమ్‌ ప్రయచ్ఛమే||

   (2)       అనసూయాసుత శ్రీశ జనపాతకనాశన

               దిగంబర నమోనిత్యం తుభ్యం మే వరదో భవ||

   (3)       భూత ప్రేత పిశాచాద్యాః యస్యస్మణమాత్రతః

               దూరాదేవపలాయంతే దత్తాత్రేయం నమామితం||

   (4)       యన్నామ స్మరణాద్దైన్యం పాపం తాపశ్చ నశ్యతి

               భీతి గ్రహార్తి దుఃస్వప్నః దత్తాత్రేయం నమామితం||

   (5)       దద్రుస్ఫోటక కుష్ఠాది మహామారీ విషూచికాః

               నశ్యంత్యన్యేపి రోగాశ్చ దత్తాత్రేయం నమామితం||

   (6)       సంగజాదేశ కాలోత్థాః అపి సాంక్రామికా గదాః

               శామ్యంతి యస్మరణతో దత్తాత్రేయం నమామితం||

   (7) సర్ప వృశ్చిక దష్టానాం విషార్తానాం శరీరిణాం

               యన్నామ శాంతిదం శ్రీఘ్రం దత్తాత్రేయం నమామితం||

   (8)       వైర్యాది కృత మంత్రాది ప్రయోగా యస్య కీర్తనాత్‌

               శామ్యన్తి దేవబాధాశ్చ దత్తాత్రేయం నమామితం||

   (9)       +యచ్చిష్యస్మరణాత్సద్యో గతనష్టాది లభ్యతే

               య ఈశః సర్వతస్త్రాతా దత్తాత్రేయం నమామితం||

   (10)     జయలాభయశఃకామదాతుర్దత్తయఃస్తవం

               భోగమోక్షప్రదస్యేమం పఠేత్‌ దత్తప్రియో భవేత్‌

+ కార్తవీర్యార్జున మంత్రము

     కార్తవీర్యార్జునోనామ రాజా బాహుసహస్రవాన్‌

     తస్యస్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే||

   శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సర్వతీ విరచితం శ్రీదత్తస్తవ స్తోత్రం సంపూర్ణమ్‌

దత్తభజనం

                                                స్మరా సద్గురు దత్తా లావూనియా తత్పదిచిత్త

                                                గురుదత్త, నివారీ పాప్‌, గురుదత్తా నివారీ తాప్‌

                                                గురుదత్త పరబ్రహ్మ నేణతీ మత్త, గురుదత్త కల్పతరుజాణ్‌

                                                త్యావిణ్‌ సోడలీల్‌ కోణ్‌ హోవూ నకో మత్త

                                                జథి కల్‌యే జబర్‌దార్‌ కుఠే రాహీర్‌ తుఝెఘర్‌దార్‌

                                                కోణ్‌కోణాచే పుత్రపరివార్‌ కాయసే విత్త

                                                అంతీ నయేకోణ కామాసి వ్యర్ధకసి యేథ్‌ భూల్‌ ఘేసి

                                                మృగజల్‌ వత్‌ మానీ భోగాంసి ఆఠవీదత్త

                                                స్మరా సద్గురు దత్త లావూనియా తత్పదిచిత్త

ఓం శివం మహత్‌ ఓం స్వస్తి

 

 

ప్రార్ధన

అనసూయాత్రి సంభూతో దత్తాయో మహామతే

సర్వ దేవాధిదేవ త్వం మమచిత్తం స్థిరీకురు

సర్వ మంగళ మాంగళ్య సర్వాధివ్యాధిభేషజ

సర్వసంకటహారిన్‌ త్వం మమచిత్తం స్థిరీకురు

సర్వ పాప క్షయకరః తాపదైన్య నివారకః

యోభీష్టదః ప్రభుః స త్వం మమ చిత్తం స్థిరీకురు

 

దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా

దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా

దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా

సిద్ధాంత అవధూత చింతన  శ్రీగురుదేవ దత్త

ఓంఓంఓంఓంఓం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి