సీ. ఒక కాలమునఁ పండు నోషధిచయము వే
ఱొక కాలమునఁ పండ కుండు నండ్రు
క్రోధంబు లోభంబు క్రూరత బొంకును
దీపింప నరులు వర్తింతు రండ్రు
వ్యవహారములు మహా వ్యాజ యుక్తము లండ్రు
సఖ్యంబు వంచనా సహా మండ్రు
మగలతొ నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు
సుతులు దండ్రుల దెగఁ జూతు రండ్రు
తే. గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు,
శాస్త్ర మార్గములెవ్వియుఁ జరుగ వండ్రు
న్యాయ పద్ధతి బుధులైన నడవరండ్రు
కాలగతి వింతయై వచ్చెఁ గంటే నేఁడు
(శ్రీమద్భాగవతము--ప్రథమ స్కంధము--322)
కలియుగములో ఔషధులు(పంటలు) ఒకసారి పండుతాయనీ వేరొకసారి అవే పంటలు పండవనీ, ప్రజలు కోపము, లోభము, క్రూరులుగ ఉందురనీ, అబద్ధాలు ఆడుతూ ఉంటారనీ, ఒకరిపై ఒకరు కుట్రలూ కుతంత్రాలూ పన్నుతూ ఉంటారనీ, స్నేహంలో కూడా వంచన ఉంటుందనీ, భర్తలతో భార్యలు తగువు పడుతూ ఉంటారనీ, కొడుకులు తండ్రులను చంపుతారనీ, గురువులతో శిష్యులు తగువు పడుతూంటారనీ, జ్ఞానులు కూడా న్యాయంగా ఉండరనీ, ఈ విధంగా కాలం లో అనేక మార్పులు వస్తాయనీ వ్యాస భగవానుడు శ్రీ మద్భాగవతము లో తెలియ చేశారు.
కావున జాగరూకతతో మెలగవలసినది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి