గురువులు ప్రియశిష్యులకుం
బరమ రహస్యములు దెలియఁ బలుకుదు, రచల
స్థిర కల్యాణం బెయ్యది
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.
(భాగవతము, 1 వ స్కందము,42 పద్యము)
సూతుని శౌనకాది మహా మునులు ఈ విధంగా ప్రశ్నించినారు. గురువులు తమ శిష్యులకు వేదాంత రహస్యములుతెలియ చేస్తారు. కావున తమరు తమ శిష్యులమైన మాకు ఆ రహస్యములు తెలియచేయవలసినది. ఏది జీవులకు అనంత శాశ్వత సౌఖ్యమును ఇచ్చునో ఆ విషయమును గూర్చి నిశ్చయించి తెలియచేయమని ప్రార్ధించిరి. అనగా ఏవిధముగా జీవుడు మోక్షమును పొందగలడో ఆ విషయమును గూర్చి తెలియ చేయమని ప్రార్ధించిరి.
కావున అందరూ గురు సేవ చేసి ముక్తి మార్గమును తెలిసికొని తరించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి