20, మే 2012, ఆదివారం

బ్రహ్మవిద్యను నేర్చుకొనుటకు  అర్హతలు ఏమిటి?

ఆత్మను చేరాలనే కోరిక గాధముగా   ఉండాలి.
సంసార తాపత్రయములను వదలి ఉండాలి 
ధనేషణ, దారేషణ, పుత్రేషణ వదలి ఉండాలి 
జాతి ధర్మములను పాటించాలి 
ఆశ్రమ ధర్మములను పాటించాలి 
నిరంతర నామ స్మరణ చేయాలి
రామాయణ, భారత, భాగవత గ్రంథములను శ్రద్ధగా చదవ వలయును 
మనుగడకు ఎంత అవసరమో అంత మాత్రమె సంపాదించాలి 
వాద వివాదములకు దూరముగా  ఉండాలి 
వీలైనంత ఏకాంతముగా ఉండాలి 

 బ్రహ్మ విద్య నిర్వచనము 

బ్రహ్మచే బోధించబడినది ఈ బ్రహ్మ విద్య .
 బ్రహ్మ గురించి బోధచేయునది  బ్రహ్మ విద్య.
ఈ జగత్తు ఆది యందున్న ఆత్మ ఈ సర్వ విశ్వముగా బాహ్యముకు  గోచరించుచూ అంతర్యామిగా ఆత్మగా ఉన్నది. కావున ఇహ లోకములకు పర లోకములకు సంబంధీచిన సర్వ వివరములూ బోధచేయునది ఈ బ్రహ్మ విద్య.  ఈ బ్రహ్మ విద్య పరమాత్మచే  నాలుగు వేదములుగా  బోధించ బడినది. ఇది దేశ కాల పాత్రలకు అతీతమై సత్యమై నిత్యమై  ఏకమై విరాజిల్లును.  


ప్రశస్తి :

 బ్రహ్మ విద్య  అన్నిటికన్నా గొప్పది. ఇందు సర్వ విద్యలూ ఇమిడి ఉన్నవి. ఇది తెలుసుకున్నచో ఈ సర్వమూ తెలియును.  రహస్యమైనది.  మంచివారలచే  సేవించబడినది.  పరాత్పరుని  పొందు  సాధన విధానము చెప్పునది. అపర విద్య పర విద్యల సమ్మేళనము గలది.  






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి